హైదరాబాద్: జీడిమెట్ల పారిశ్రామికవాడలో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. హెచ్‌ఎంటీ సమీపంలో గురువారం ఉదయం ఓ గుర్తు తెలియని మహిళ మృతి చెందినట్లు గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. గుర్తు తెలియని దుండగులు మహిళ(45)ను బండరాయితో కొట్టి చంపినట్లుగా భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించనున్నారు.