కుత్బుల్లాపూర్: మహిళ హత్య కేసు మిస్టరీని జీడిమెట్ల పోలీసులు సీసీ ఫుటేజీ ఆధారంగా ఛేదించారు. పాత నేరస్తుడే బంగారు ఆభరణాల కోసం మహిళను చంపినట్లు పోలీసులు వెల్లడించారు.
చెరుకుపల్లి కాలనీకి చెందిన మహ్మద్ షమీర్ (32)కు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఇతనిపై జీడిమెట్ల పీఎస్‌తో పాటు పలు పోలీస్‌స్టేషన్లలో 11 పైగా దొంగతనాలు, దోపిడీ కేసులున్నాయి. మద్యానికి బానిసైన షమీర్ అప్పులు చేశాడు. ఈ నెల 5వ తేదీన బాకీ తీరుస్తానని హామీ ఇచ్చాడు. ఇదే క్రమంలోనే 2వ తేదీన ప్రతిరోజూ కల్లు దుకాణానికి వచ్చే చాకలి పోచమ్మపై అతని కన్ను పడింది. ఆమె కడియాలు, చెవిదిద్దులను కాజేయాలని పథకం పన్నాడు.
ఈమేరకు హెచ్‌ఎంటీ ఖాళీ ప్రదేశానికి ఆమెను తీసుకువెళ్లి ఆమెతో మద్యం తాగించాడు. సృహ కోల్పోయిన పోచమ్మ తలపై బండరాయితో మోది చంపి రూ. 25 వేలు విలువ చేసే 60 తులాల వెండి, 3 గ్రాముల బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లాడు. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు సీసీ ఫుటేజీని పరిశీలించారు. అందులో పోచమ్మతో పాటు షమీర్ వెళ్తున్న దృశ్యాలను గుర్తించిన పోలీసులు పాత నేరస్థుడిగా నిర్ధారించారు. అతన్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా తానే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు.
హత్యకేసులో నిందితుడి అరెస్ట్
Published Mon, Mar 7 2016 8:29 PM | Last Updated on Thu, Oct 4 2018 8:29 PM
Advertisement
Advertisement