వరప్రసాద్(ఫైల్) రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన వరప్రసాద్
సాక్షి, జీడిమెట్ల: పెళ్లై నాలుగు నెలలు కూడా అవ్వలేదు.. కొత్త జంట కొత్త ఆశలతో నగరానికి వచ్చారు. కానీ వీరి దాంపత్యాన్ని ఓర్వలేని మృత్యువు ప్రైవేట్ ట్రావెల్స్ రూపంలో వచ్చి నూతన పెళ్లి కొడుకుని కబళించింది. ఈ హృదయవిదారక సంఘటన జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ.కె.బాలరాజు వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమగోదావరి జిల్లా టి.నరసాపురం మండలం అప్పలరాజుగూడెంకు చెందిన రామచందర్‌రావు కుమారుడు దుర్గ సత్యవరప్రసాద్ ఐటీఐ చేశాడు.
హైదరాబాద్ జీడిమెట్లలోని కలోరమ ప్రింటర్స్‌లో మెషిన్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు.కాగా వరప్రసాద్‌కు గత నెలల క్రితం వారి సొంత ప్రాంతం పరిధిలోని ద్రాక్షాయనితో వివాహం జరిగింది. భార్య ద్రాక్షాయనితో కలిసి సొంత ఊరికి వెళ్లిన వరప్రసాద్ మంగళవారం ఉదయం నగరానికి చేరుకున్నాడు. ఉదయం 8:30 గంటల ప్రాంతంలో డ్యూటీకి వెళ్లేందుకు ఇంటి నుంచి వచ్చాడు. షాపూర్‌నగర్‌లోని డీసీపీ కార్యాలయం ముందు రోడ్డు దాటుతున్నాడు.
చదవండి: కన్న తల్లిపై కర్కశత్వం.. పెనంతో కొట్టి చంపిన కూతురు
ఈ క్రమంలో గాజులరామారం నుంచి షాపూర్‌నగర్ వైపు వస్తున్న నేషనల్ ట్రావెల్స్ బస్సు(టీఎస్09యూబీ1994) రోడ్డు దాటుతున్న వరప్రసాద్‌ను ఢీకొట్టగా కిందపడిపోయాడు. ఈ ఘటనలో తలకు తీవ్రగాయాలైన వరప్రసాద్ అక్కడికక్కడే మృతిచెందాడు. ఘటనా స్థలికి చేరుకున్న జీడిమెట్ల పోలీసులు వరప్రసాద్ భార్య ద్రాక్షాయని ఫిర్యాదు మేరకు బస్సు డ్రైవర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment