సాక్షి, హైదరాబాద్: నగరంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ కుటుంబం యజమానిని కోల్పోయింది. ఈ ఘటన దుందిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాలివి.. వీరంకి రమేష్(50) బహదూర్ పల్లి గ్రామం స్వస్థలం. ఆయన వెల్డర్‌గా పనిచేస్తున్నాడు. గురువారం ఉదయం తన ఇద్దరు పిల్లలు సంజన(14),దేవదాస్(13)లను స్కూల్‌లో దింపేందుందకకు బైక్‌పై జీడిమెట్ల వైపు వెళ్తున్నాడు.
అతను ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ సమీపంలో ఎదురుగా వచ్చిన టాటా మోటార్ వాహనం బైక్‌ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో రమేష్ తలకి తీవ్ర గాయాలు కావడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. దేవదాస్‌కు స్పల్ప గాయలయ్యాయి. కూతురు సంజనకు ఈ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడింది. చికిత్స నిమిత్తం అతడిని సూరారంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment