newly married person
-
హైదరాబాద్: పెళ్లై నాలుగు నెలలు గడవకముందే..
సాక్షి, జీడిమెట్ల: పెళ్లై నాలుగు నెలలు కూడా అవ్వలేదు.. కొత్త జంట కొత్త ఆశలతో నగరానికి వచ్చారు. కానీ వీరి దాంపత్యాన్ని ఓర్వలేని మృత్యువు ప్రైవేట్ ట్రావెల్స్ రూపంలో వచ్చి నూతన పెళ్లి కొడుకుని కబళించింది. ఈ హృదయవిదారక సంఘటన జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ.కె.బాలరాజు వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమగోదావరి జిల్లా టి.నరసాపురం మండలం అప్పలరాజుగూడెంకు చెందిన రామచందర్‌రావు కుమారుడు దుర్గ సత్యవరప్రసాద్ ఐటీఐ చేశాడు. హైదరాబాద్ జీడిమెట్లలోని కలోరమ ప్రింటర్స్‌లో మెషిన్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు.కాగా వరప్రసాద్‌కు గత నెలల క్రితం వారి సొంత ప్రాంతం పరిధిలోని ద్రాక్షాయనితో వివాహం జరిగింది. భార్య ద్రాక్షాయనితో కలిసి సొంత ఊరికి వెళ్లిన వరప్రసాద్ మంగళవారం ఉదయం నగరానికి చేరుకున్నాడు. ఉదయం 8:30 గంటల ప్రాంతంలో డ్యూటీకి వెళ్లేందుకు ఇంటి నుంచి వచ్చాడు. షాపూర్‌నగర్‌లోని డీసీపీ కార్యాలయం ముందు రోడ్డు దాటుతున్నాడు. చదవండి: కన్న తల్లిపై కర్కశత్వం.. పెనంతో కొట్టి చంపిన కూతురు ఈ క్రమంలో గాజులరామారం నుంచి షాపూర్‌నగర్ వైపు వస్తున్న నేషనల్ ట్రావెల్స్ బస్సు(టీఎస్09యూబీ1994) రోడ్డు దాటుతున్న వరప్రసాద్‌ను ఢీకొట్టగా కిందపడిపోయాడు. ఈ ఘటనలో తలకు తీవ్రగాయాలైన వరప్రసాద్ అక్కడికక్కడే మృతిచెందాడు. ఘటనా స్థలికి చేరుకున్న జీడిమెట్ల పోలీసులు వరప్రసాద్ భార్య ద్రాక్షాయని ఫిర్యాదు మేరకు బస్సు డ్రైవర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పెళ్లై 24 గంటలు: కోమాలోకి వెళ్లిన వధువు మృతి
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ శేరిలింగంపల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి. పెళ్లై ఒక్క రోజు కూడా పూర్తవ్వకముందే.. వారి జీవితాలు చిన్నాభిన్నం అయ్యాయి. రోడ్డు ప్రమాదం రూపంలో విధి వారిని వెక్కిరించింది. వివాహమైన 24 గంటలకే కారు యాక్సిడెంట్లో పెళ్లి కుమారుడు చనిపోగా.. తీవ్ర గాయాలపాలైన నవవధువు కోమాలోకి వెళ్లింది. వివరాల్లోకి వెళితే.. (చదవండి: మాజీ మిస్ కేరళ, రన్నరప్ మృతి: ఆడి కారులో వెంటాడి మరీ) మృతుడు శ్రీనివాస్ వివాహం మంగళవారం తిరుపతిలో జరిగింది. అనంతరం నూతన దంపతులు చెన్నైలోని అత్తగారింటికి కారులో వెళ్తున్నారు. ఈ క్రమంలో బెంగళూరు సమీపంలో నవ దంపతులు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంతో శ్రీనివాస్ మృతి చెందగా.. తీవ్ర గాయాలపాలైన పెళ్లి కుమార్తె కోమాలోకి వెళ్లిపోయింది. నూరేళ్లు పచ్చగా సాగాల్సిన వైవాహిక జీవితం.. 24 గంటల వ్యవధిలో ఇలా విషాదంతం కావాడాన్ని ఇరు కుటుంబాలు జీర్ణించుకోలేకపోతున్నారు. చదవండి: రాజేంద్రనగర్‌లో దారుణం.. స్నేహితుడిని వదిలి వస్తుండగా -
పెళ్లయిన 20 రోజులకే యువకుడి ఆత్మహత్య
ఆదిలాబాద్ : పెళ్లయిన 20 రోజులకే ఓ కొత్త పెళ్లికొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు. పెద్దలకు ఇష్టం లేకపోయినా తన మనసుకు నచ్చిన యువతిని ప్రేమించి పెళ్లిచేసుకున్న ఆ యువకుడు ఉన్నట్టుండి ఆత్మహత్య చేసుకుని ఈ లోకాన్నే వీడాడు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా లక్సెట్టిపేట మండలం శాంతాపూర్‌లో జరిగింది. శాంతాపూర్ గ్రామానికి చెందిన ఆవునూరి వెంకటేశ్ అనే యువకుడు ఆదివారం రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేయగా, గమనించిన కుటుంబ సభ్యులు కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా చికిత్స పొందుతూ వెంకటేశ్ సోమవారం మధ్యాహ్నం మృతి చెందాడు. అయితే ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా వెల్లడికాలేదు.