పెళ్లయిన 20 రోజులకే యువకుడి ఆత్మహత్య | man commits suicide on the 20th day of marriage | Sakshi
Sakshi News home page

పెళ్లయిన 20 రోజులకే యువకుడి ఆత్మహత్య

Published Mon, Apr 20 2015 3:51 PM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM

పెళ్లయిన 20 రోజులకే యువకుడి ఆత్మహత్య - Sakshi

పెళ్లయిన 20 రోజులకే యువకుడి ఆత్మహత్య

ఆదిలాబాద్ : పెళ్లయిన 20 రోజులకే ఓ కొత్త పెళ్లికొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు.  పెద్దలకు ఇష్టం లేకపోయినా తన మనసుకు నచ్చిన యువతిని ప్రేమించి పెళ్లిచేసుకున్న ఆ యువకుడు ఉన్నట్టుండి ఆత్మహత్య చేసుకుని ఈ లోకాన్నే వీడాడు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా లక్సెట్టిపేట మండలం శాంతాపూర్‌లో జరిగింది.

శాంతాపూర్‌ గ్రామానికి చెందిన ఆవునూరి వెంకటేశ్ అనే యువకుడు ఆదివారం రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేయగా, గమనించిన కుటుంబ సభ్యులు కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా చికిత్స పొందుతూ వెంకటేశ్ సోమవారం మధ్యాహ్నం మృతి చెందాడు. అయితే ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా వెల్లడికాలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement