
సాక్షి, హైదరాబాద్ : నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ సంఘటన జీడిమెట్ల పీఎస్ పరిధిలో టీఎస్‌ఐఐసీ కాలనీ వద్ద జరిగింది. వివరాలివి.. వేగంగా ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీ కొట్టింది. దీంతో ఇద్దరు యువకులు ఘటన స్థలంలోని మృతి చెందగా, మరో ముగ్గురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
ప్రమాదంలో కారు నుజ్జునుజ్జయింది. మృతిచెందిన యువకులు సురారం సాయిబాబా నగర్‌కి చెందిన వారుగా స్థానికులు గుర్తించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment