తల్లి ఒడిలో జోలపాటలతో హాయిగా నిదురించవలసిన ఆ పసికందు మృతదేహమై నాలాలో పడిఉంది.
జీడిమెట్ల(హైదరాబాద్‌సిటీ): తల్లి ఒడిలో జోలపాటలతో హాయిగా నిదురించవలసిన ఆ పసికందు మృతదేహమై నాలాలో పడిఉంది. ఈ ఘటన జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో కలకలం రేపింది. వివరాలు..షాపూర్‌నగర్ రైతు బజారు వద్ద గురువారం ఉదయం హమాలీ పని చేయడానికి వచ్చిన కూలీ మేషయ్య నాలాలో పడిఉన్న పసికందు మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించాడు.
అక్కడికి చేరుకున్న జీడిమెట్ల పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని గాంధీ ఆస్పత్రికి తరలించారు. పసిపాప కు 15 రోజుల వయసు ఉంటుందని మేషయ్య ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. సమీపంలో ఉన్న ఆస్పత్రుల్లో గడిచిన పదిహేను రోజుల్లో ఎవరెవరు ప్రసవించారన్న విషయాలపై ఆరా తీస్తున్నారు.