హైదరాబాద్: నగరంలోని ప్రముఖ పారిశ్రామిక కేంద్రమైన జీడిమెట్లలో మంగళవారం అర్ధరాత్రి దాటాక భారీ అగ్ని ప్రమాదం జరిగింది. దూలపల్లి పారిశ్రామిక వాడలోని కెమికల్ గోదాము వద్ద.. లారీ నుంచి కెమికల్ తీస్తుండగా.. ఒక్కసారిగా మంటలు ఎగిసిపడటంతో.. భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సకాలంలో సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. భారీగా ఆస్తి నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది.