
సాక్షి, హైదరాబాద్: బీ-ఫార్మసీ విద్యార్థిని సోనీ కిడ్నాప్ కేసు నుంచి తెరుకొనేలోపే నగరంలోని జీడిమెట్లలో మరో కిడ్నాప్ కలకలం సృష్టిస్తోంది. అయితే కిడ్నాపర్లు దివ్యను ఒంగోలులో విడిచి పెట్టడంతో పోలీసులు దివ్య తల్లిదండ్రులకు సమాచారం అందించారు. గత వారం సోనీ కిడ్నాప్.. రెండు రోజులకు ముందు వ్యాపారవేత్త గజేందర్ కిడ్నాప్, రెండు గంటల్లో విడుదల.. ఇలా నగరంలో ఏదో ఓ చోట కిడ్నాప్ కేసులు నమోదవుతూ తీవ్ర ఉత్కంఠకు తెర లేపుతున్నాయి.
హయత్ నగర్ యువతి కిడ్నాప్ తరహాలోనే జీడీమెట్లలో దివ్యని కిడ్నాప్ చేసి ఒంగోలులో విడిచిపెట్టారు. యువతి అపహరణకు గురైనప్పటి నుంచి పలు మలుపులు తిరుగుతూ వచ్చిన కిడ్నాప్ కథ ఎట్టకేలకు సుఖాంతం అయ్యింది. అయితే హయత్ నగర్ కిడ్నాపర్ రవి శేఖర్కు, జీడిమెట్ల దివ్య కిడ్నాప్ కేసుకు లింక్ ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ రెండు కిడ్నాప్లు రవి శేఖర్ చేశాడా? అన్నకోణంలో పోలీసులు విచారిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment