జీడిమెట్ల : పాఠశాల విద్యార్ధినిపై డిగ్రీ విద్యార్థి లైంగిక దాడికి పాల్పడిన ఘటన జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ చంద్రశేఖర్ వివరాల ప్రకారం.. రంగారెడ్డి నగర్ డివిజన్ విజయ నగర్ కాలనీకి చెందిన బాలిక(14) స్థానికంగా ఉన్న ఓ పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. కాగా శనివారం బాలిక స్కూల్‌కు వెళ్లకుండా ఇంటి వద్దనే ఉంది. అదే కాలనీకి చెందిన డిగ్రీ విద్యార్థి రమేష్ ఒంటరిగా ఉన్న బాలిక ఇంట్లోకి వెళ్లి బలవంతంగా అత్యాచారానికి పాల్పడ్డాడు.