గణేష్‌ మండపం వద్ద విషాదం | A boy Died Due To Electric Shock Ganesh Mandapam In jeedimetla | Sakshi
Sakshi News home page

గణేష్‌ మండపం వద్ద విషాదం

Published Tue, Sep 14 2021 4:30 PM | Last Updated on Tue, Sep 14 2021 4:51 PM

A boy Died Due To Electric Shock Ganesh Mandapam In jeedimetla - Sakshi

( ఫైల్‌ ఫోటో )

సాక్షి, జీడిమెట్ల: వినాయకుడి మండపం వద్ద ఏర్పాటు చేసిన విద్యుత్‌ వైర్లు తగిలి కరెంట్‌ షాక్‌కు గురై ఓ బాలుడు మృతిచెందిన ఘటన జీడిమెట్ల పీఎస్‌ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ కె.బాలరాజు తెలిపిన వివరాలు.. షాపూర్‌నగర్‌లోని న్యూ ఎల్‌బీనగర్‌కు చెందిన గుండు ఆనంద్‌ కుమారుడు అనిల్‌(5) ఇంటి సమీపంలోని సంతోషిమాత ఆలయం వద్ద ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద పిల్లలతో కలిసి సోమవారం ఉదయం 11 గంటలకు ఆడుకుంటున్నాడు.

మండపం నిర్వాహకులు అలంకరణ కోసం ఏర్పాటు చేసిన విద్యుత్‌ దీపాల వైర్లు అస్తవ్యస్తంగా ఉండటంతో అనిల్‌ విద్యుత్‌ వైర్లకు తగలడంతో విద్యుదాఘాతానికి గురయ్యాడు. బంధువు మల్లేష్‌ అనిల్‌ను షాపూర్‌నగర్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన డ్యూటీ డాక్టర్‌ బాలుడు మరణించినట్లు తెలిపారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 
చదవండి: Karimnagar: అత్తగారింట్లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఆత్మహత్య

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement