ganesh mandapas
-
గణేష్ ఉత్సవాలు షురూ.. ఈ జాగ్రత్తలు, సూచనలు మర్చిపోకండి!
సాక్షి, ఆదిలాబాద్: గణేశ్ నవరాత్రోత్సవాల సందర్భంగా వారం ముందు నుంచే పండుగ వాతావరణం నెలకొంటుంది. చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా అంతా కలిసికట్టుగా జరుపుకొనే ఈ పండుగ అందరిలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. ఆగస్టు 31న వినాయకుడి ప్రతిమలను ప్రతిష్ఠించడంతో గణేశ్ ఉత్సవాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో నవరాత్రులు సజావుగా జరిగేందుకు శాంతిభద్రతలను దృష్టిలో ఉంచుకొని గణేశ్ ఉత్సవ కమిటీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పోలీసులు, విద్యుత్ అధికారులు పలు సూచనలు చేశారు. పోలీస్‌శాఖ సూచనలు.. ► గణేశ్ మండపాలను ఇరుకైన వీధుల్లో ఏర్పాటు చేయరాదు. ►మండపాల వద్ద మద్యం సేవించరాదు. జూదం ఆడరాదు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడవద్దు. ►మండపం వద్ద కనీసం ముగ్గురు వలంటీర్లు 24 గంటలు అందుబాటులో ఉండాలి. ప్రతి రోజు వలంటీర్ల పేర్లను నమోదు చేసి సంతకం తీసుకోవాలి. ►మండపాలను గాలి, వానకు కూలిపోకుండా పకడ్బందీగా నిర్మించాలి. రద్దీగా ఉండే మండపాల వద్ద బారికేడ్లు ఏర్పా టు చేయాలి. వలంటీర్లు భక్తులను తనిఖీ చేశాకే మండపం వద్దకు పంపాలి. ►మండపంలోకి ఎలాంటి మండే పదార్థాలు లేదా పటాకులు ఉంచకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. నూనెతో వెలిగించే దీపాల విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి. ►మండపాల వద్ద నిర్వాహకులు తప్పనిసరిగా వీడియో కెమెరాలు, సీసీటీటీలు ఏర్పాటు చేసుకోవాలి. ►రాత్రి వేళ మండపంలోకి పశువులు, కుక్కలు చొరబడకుండా అడ్డుగా కంచె ఏర్పాటు చేసుకోవాలి. ►ఆగస్టు 31న ఉదయం 6గంటల నుంచి సెప్టెంబర్ 11న సాయంత్రం 6 గంటల వరకు బహిరంగ ప్రదేశాలు, రోడ్లపై క్రాకర్లు కాల్చడం, పేల్చడం నిషేధం. ►సౌండ్ బాక్స్‌లను స్థానిక డీఎస్పీ అనుమతి లేకుండా ఉపయోగించరాదు. మండపం వద్ద ఒక బాక్స్ టైపు స్పీకర్ మండప ప్రాంగణంలో మాత్రమే ఇన్స్టాల్ చేయబడాలి. ►శబ్ధ స్థాయిలను అనుమతించదగిన ప రిమితుల్లోనే ఉంచాలి. భారత సర్వోన్న త న్యాయస్థానం ఆదేశాల మేరకు రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల మధ్య లౌడ్స్పీకర్లు, పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్‌లను ఉపయోగించకూడదు. ►మండపాల వద్ద ఎలాంటి అసభ్యకరమైన పాటలు, ప్రకటనలు చేయకుండా భక్తి పాటలను మాత్రమే ప్లే చేయాలి. ►ఏదైన సమాచారం కోసం డయల్ 100 లేదా స్థానిక పోలీసులను సంప్రదించాలి. విద్యుత్‌శాఖ సూచనలు.. ►వినాయక నవరాత్రులను పురస్కరించుకుని మండపాల వద్ద జాగ్రత్తగా ఉండాలని టీఎస్ఎన్పీడీసీఎల్ అధికారులు సూచిస్తున్నారు. మండపాల వద్ద తాత్కాలికంగా ఏర్పాటు చేసుకునే విద్యుత్ తీగలతో అనేక ప్రమాదాలు జరిగే ఆస్కారముందని, అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు. పూర్తిగా నివాస ప్రాంతాల్లో ఏర్పాటు చేసే మండపాల్లో షార్ట్ సర్క్యూట్లు, విద్యుత్ షాక్‌లు తగిలితే ఆస్తి, ప్రాణనష్టం జరిగే ప్రమాదముందంటున్నారు. ►మండపాల విద్యుద్దీకరణ పనులు లైసెన్స్డ్ ఎలక్ట్రిక్ కాంట్రాక్టర్ ద్వారా మాత్రమే చేపట్టాలి. ►విద్యుత్ సరఫరా కోసం ఎర్త్ లీకేజ్ సర్క్యూట్ బ్రేకర్‌గా అమర్చుకోవాలి. లైన్ల నుంచి వచ్చే వైర్ల నుంచి మండపానికి సరఫరా అయ్యే చోట ఈ బ్రేకర్‌ను అమర్చుకోవాలి. ►మండపానికి విద్యుత్ అందించే వైర్లు 2.5 చదరపు మిల్లీమీటర్ల కంటే తక్కువగా ఉండరాదు. ► ప్రతి సర్క్యూట్‌పై 800 వాట్ల కంటే అధిక లోడ్ వేయరాదు. ►వరుస విద్యుద్దీపాల కోసం సిల్క్‌వైర్లను వాడడం మంచిదికాదు. దీని వల్ల షార్ట్ సర్క్యూట్ జరిగే ప్రమాదముంటుంది. ►ప్రతి సర్క్యూట్‌కు ప్రత్యేకించి న్యూట్రల్ ఎర్త్‌వైర్‌ను తీసుకోవాలి. ►మండపాల వద్ద ఎర్తింగ్ గుంతలను ఏర్పాటు చేసుకోవాలి. 25 ఎంఎం డయామీటర్, 3 మీటర్ల లోతైన గుంత తీసి ఎర్తింగ్ పైప్‌ను అమర్చుకోవాలి. ►మండపాల్లో విద్యుత్ ఎలక్ట్రిక్ హీటర్లు, ఎలక్ట్రిక్ స్టౌవ్‌లను వాడరాదు. ►ప్రతి మండపం వద్ద 5 కేజీల కార్బన్డయాక్సైడ్ నిండి ఉన్న అగ్నిమాపక సిలిండర్లను అమర్చుకోవాలి. 2 బకెట్లలో ఇసుకను నింపి పెట్టుకోవడం మంచిది. -
సిబ్బంది ద్వారానే కరెంట్ తీసుకోండి
సాక్షి, హైదరాబాద్: వినాయక చవితి సందర్భంగా గణేశ్ మండపాలకు కరెంట్ కనెక్షన్ కోసం సామాన్యులు విద్యుత్ స్తంభాలు ఎక్కరాదని, విద్యుత్ సిబ్బంది ద్వారానే కనెక్షన్ పొందాలని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(టీఎస్ఎస్పీడీసీఎల్) సీఎండీ జి.రఘుమారెడ్డి విజ్ఞప్తి చేశారు. గణేశ్ మండపాలకు నిరంతర విద్యుత్‌ను సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేశామని తెలిపారు. మండపాల వద్ద తీసుకో వాల్సిన భద్రతాచర్యలపై సోమవారం ఆయన సమీక్ష నిర్వహించారు. మండపాల వద్ద జాగ్రత్తలు పాటించాలని నిర్వాహకులను కోరారు. ముఖ్యమైన జాగ్రత్తలు..: మండపాల్లో ఉపయోగించే విద్యుత్ పరికరాల లోడ్‌కు తగ్గట్టు నాణ్యమైన కేబుల్స్‌ను వాడాలి. అతుకులు ఉన్న, ఇన్సులేషన్ లేని వైర్లను వాడటం ప్రమాదకరం. ∙మండపాల్లో లోడ్‌కు తగ్గ సామర్థ్యం కలిగిన ఎంసీబీ (మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్) లను తప్పనిసరిగా వాడాలి. ఒక వేళ ఎంసీబీలు ఓవర్ లోడ్‌కు గురైతే షార్ట్ సర్క్యూట్ జరిగి అగ్ని ప్రమాదాలు చోటుచేసుకునే అవకాశం ఉంటుంది. ∙విద్యుత్ సబ్ స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్ల వద్ద గణేశ్ మండపాలను ఏర్పాటు చేయరాదు. ∙విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్ల దిమ్మెలను మండపాలకు సపోర్ట్ కోసం వాడరాదు. – విద్యుత్ వైర్లు, స్తంభాలు, ఇతర ప్రమాదకర పరికరాల నుంచి పిల్లలను దూరంగా ఉంచాలి. ∙ఒక వేళ ఎవరికై నా కరెంట్ షాక్ తగిలితే వెంటనే వైద్య సహాయం అందించి, ఆ ప్రమాదం గురించి దగ్గరలోని విద్యు త్ సిబ్బందికి తెలియజేయాలి. ∙విద్యుత్ వైర్లు ఎక్కడైనా తెగిపడ్డా, ఇతర అత్యవసర పరిస్థితులు ఏర్పడినా వెంటనే 1912 లేదా 100 లేదా సమీపంలోని ఫ్యుజ్ ఆఫ్ కాల్ నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలి. -
గణేష్ మండపం వద్ద విషాదం
సాక్షి, జీడిమెట్ల: వినాయకుడి మండపం వద్ద ఏర్పాటు చేసిన విద్యుత్ వైర్లు తగిలి కరెంట్ షాక్‌కు గురై ఓ బాలుడు మృతిచెందిన ఘటన జీడిమెట్ల పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ కె.బాలరాజు తెలిపిన వివరాలు.. షాపూర్‌నగర్‌లోని న్యూ ఎల్బీనగర్కు చెందిన గుండు ఆనంద్ కుమారుడు అనిల్(5) ఇంటి సమీపంలోని సంతోషిమాత ఆలయం వద్ద ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద పిల్లలతో కలిసి సోమవారం ఉదయం 11 గంటలకు ఆడుకుంటున్నాడు. మండపం నిర్వాహకులు అలంకరణ కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాల వైర్లు అస్తవ్యస్తంగా ఉండటంతో అనిల్ విద్యుత్ వైర్లకు తగలడంతో విద్యుదాఘాతానికి గురయ్యాడు. బంధువు మల్లేష్ అనిల్‌ను షాపూర్‌నగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన డ్యూటీ డాక్టర్ బాలుడు మరణించినట్లు తెలిపారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: Karimnagar: అత్తగారింట్లో సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఆత్మహత్య -
గణేశ్ మండపాలకు తాత్కాలిక విద్యుత్ కనెక్షను
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ చట్టం–2003 ప్రకారం విద్యుత్ చౌర్యం నేరం, ప్రమాదకరమని..గణేశ్ మండపాల అవసరాలకు నిర్వాహకులు విధిగా విద్యుత్ కనెక్షన్లు తీసుకోవాలని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(టీఎస్ఎస్పీడీసీఎల్) సీఎండీ జి.రఘుమారెడ్డి మంగళవారం తెలిపారు. ఈ నెల 13 నుంచి 23 వరకు 11 రోజుల పాటు జరుపనున్న వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసే మండపాలకు తాత్కాలిక ఎల్టీ విద్యుత్ కనెక్షన్ల జారీ కోసం నిర్ణీత రుసుం చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని నిర్వాహకులకు కోరారు. 250 వాట్ల వినియోగానికి రూ.500, 250–500 వాట్ల వినియోగానికి రూ.1000, 500–1000 వాట్ల వినియోగానికి రూ.1500, ఆపై వినియోగించే ప్రతి 500 వాట్లకు రూ.750 రుసుంను దరఖాస్తుతో పాటు చెల్లించాలన్నారు. దరఖాస్తుదారులు మీటర్డ్ విద్యుత్ సరఫరా కోరితే నిబంధనల ప్రకారం ఎల్టీ తాత్కాలిక విద్యుత్ కనెక్షన్ జారీ చేస్తారన్నారు. ప్రతి యూనిట్‌కు రూ.11 చొప్పున విద్యుత్ చార్జీలు వసూలు చేస్తామని, 21/కిలోవాట్/నెల చొప్పున ఫిక్స్డ్ చార్జీలు వర్తిస్తాయన్నారు. -
'గణేశ్ మండపాలపై పోలీసులకు సమాచారం ఇస్తే చాలు'
పంజాగుట్ట: హైదరాబాద్ నగర పరిధిలో ఏర్పాటు చేసుకునే వినాయక మండపాలకు ఎలాంటి పోలీస్ అనుమతి అవసరం లేదని, సంబంధిత పోలీస్స్టేషన్లలో సమాచారం ఇస్తే సరిపోతుందని భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి అధ్యక్షుడు జి.రాఘవరెడ్డి తెలిపారు. బుధవారం ఎర్రమంజిల్‌లోని హోటల్ ఎన్కెఎమ్ గ్రాండ్లో భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి భగవత్‌రావు, ఉపాధ్యక్షుడు నర్సింగ్, ఖైరతాబాద్ గణేశ్ సమితి అధ్యక్షుడు సుదర్శన్‌లతో కలసి ఆయన మాట్లాడారు. అనుమతుల పేరుతో పోలీసులు వేధింపులు ఆపాలని కోరారు. అన్ని మండపాలకు ప్రభుత్వం ఉచితంగా కరెంట్ అందించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 17న విగ్రహ ప్రతిష్టాపనతో ఉత్సవాలు ప్రారంభమవుతాయని, 27న సామూహిక నిమజ్జనోత్సవం ట్యాంక్‌బండ్‌లో ఉంటుందని వివరించారు.