
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ చట్టం–2003 ప్రకారం విద్యుత్ చౌర్యం నేరం, ప్రమాదకరమని..గణేశ్ మండపాల అవసరాలకు నిర్వాహకులు విధిగా విద్యుత్ కనెక్షన్లు తీసుకోవాలని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(టీఎస్‌ఎస్పీడీసీఎల్) సీఎండీ జి.రఘుమారెడ్డి మంగళవారం తెలిపారు. ఈ నెల 13 నుంచి 23 వరకు 11 రోజుల పాటు జరుపనున్న వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసే మండపాలకు తాత్కాలిక ఎల్టీ విద్యుత్ కనెక్షన్ల జారీ కోసం నిర్ణీత రుసుం చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని నిర్వాహకులకు కోరారు.
250 వాట్ల వినియోగానికి రూ.500, 250–500 వాట్ల వినియోగానికి రూ.1000, 500–1000 వాట్ల వినియోగానికి రూ.1500, ఆపై వినియోగించే ప్రతి 500 వాట్లకు రూ.750 రుసుంను దరఖాస్తుతో పాటు చెల్లించాలన్నారు. దరఖాస్తుదారులు మీటర్డ్ విద్యుత్ సరఫరా కోరితే నిబంధనల ప్రకారం ఎల్టీ తాత్కాలిక విద్యుత్ కనెక్షన్ జారీ చేస్తారన్నారు. ప్రతి యూనిట్‌కు రూ.11 చొప్పున విద్యుత్ చార్జీలు వసూలు చేస్తామని, 21/కిలోవాట్/నెల చొప్పున ఫిక్స్‌డ్ చార్జీలు వర్తిస్తాయన్నారు.
Comments
Please login to add a commentAdd a comment