Raghumareddy
-
ఉద్యోగాలు ఇప్పిస్తామంటే నమ్మొద్దు: రఘుమారెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ విద్యుత్ సంస్థలో ఉద్యోగాలు ఇప్పిస్తామని ప్రలోభాలకు గురిచేసి డబ్బులు వసూలు చేసే దళారులు, సంస్థ సిబ్బంది మాటలు నమ్మి మోసపోవద్దని అభ్యర్థులకు సంస్థ సీఎండీ రఘుమారెడ్డి సూచించారు. జూనియర్ లైన్మెన్ (జేఎల్ఎం) నియామకంలో నిర్ణిత అర్హతలు ఉండి, స్తంభాలు ఎక్కే (పోల్ క్లైంబింగ్) పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థుల నుంచి మెరిట్, రూల్ ఆఫ్ రిజర్వేషన్స్ అనుసరించి అత్యంత పారదర్శకంగా ఎంపిక జరుగుతుందని శనివారం ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. మెరిట్, రూల్ మాఫ్ రిజర్వేషన్స్‌ను ప్రామాణికంగా తీసుకుని అర్హులైన అభ్యర్థులకు ఈనెల 28 నుంచి వివిధ జిల్లా/సర్కిల్ కేంద్రాల్లో సర్టిఫికెట్స్ వెరిఫికేషన్, పోల్ క్లైంబింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని సంస్థ వెబ్సైట్లో పొందుపరిచామన్నారు. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలో 1,553 జూనియర్ లైన్మెన్ పోస్టులకు ఈ ఏడాది నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. -
సిబ్బంది ద్వారానే కరెంట్ తీసుకోండి
సాక్షి, హైదరాబాద్: వినాయక చవితి సందర్భంగా గణేశ్ మండపాలకు కరెంట్ కనెక్షన్ కోసం సామాన్యులు విద్యుత్ స్తంభాలు ఎక్కరాదని, విద్యుత్ సిబ్బంది ద్వారానే కనెక్షన్ పొందాలని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(టీఎస్ఎస్పీడీసీఎల్) సీఎండీ జి.రఘుమారెడ్డి విజ్ఞప్తి చేశారు. గణేశ్ మండపాలకు నిరంతర విద్యుత్‌ను సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేశామని తెలిపారు. మండపాల వద్ద తీసుకో వాల్సిన భద్రతాచర్యలపై సోమవారం ఆయన సమీక్ష నిర్వహించారు. మండపాల వద్ద జాగ్రత్తలు పాటించాలని నిర్వాహకులను కోరారు. ముఖ్యమైన జాగ్రత్తలు..: మండపాల్లో ఉపయోగించే విద్యుత్ పరికరాల లోడ్‌కు తగ్గట్టు నాణ్యమైన కేబుల్స్‌ను వాడాలి. అతుకులు ఉన్న, ఇన్సులేషన్ లేని వైర్లను వాడటం ప్రమాదకరం. ∙మండపాల్లో లోడ్‌కు తగ్గ సామర్థ్యం కలిగిన ఎంసీబీ (మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్) లను తప్పనిసరిగా వాడాలి. ఒక వేళ ఎంసీబీలు ఓవర్ లోడ్‌కు గురైతే షార్ట్ సర్క్యూట్ జరిగి అగ్ని ప్రమాదాలు చోటుచేసుకునే అవకాశం ఉంటుంది. ∙విద్యుత్ సబ్ స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్ల వద్ద గణేశ్ మండపాలను ఏర్పాటు చేయరాదు. ∙విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్ల దిమ్మెలను మండపాలకు సపోర్ట్ కోసం వాడరాదు. – విద్యుత్ వైర్లు, స్తంభాలు, ఇతర ప్రమాదకర పరికరాల నుంచి పిల్లలను దూరంగా ఉంచాలి. ∙ఒక వేళ ఎవరికై నా కరెంట్ షాక్ తగిలితే వెంటనే వైద్య సహాయం అందించి, ఆ ప్రమాదం గురించి దగ్గరలోని విద్యు త్ సిబ్బందికి తెలియజేయాలి. ∙విద్యుత్ వైర్లు ఎక్కడైనా తెగిపడ్డా, ఇతర అత్యవసర పరిస్థితులు ఏర్పడినా వెంటనే 1912 లేదా 100 లేదా సమీపంలోని ఫ్యుజ్ ఆఫ్ కాల్ నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలి. -
గణేశ్ మండపాలకు తాత్కాలిక విద్యుత్ కనెక్షను
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ చట్టం–2003 ప్రకారం విద్యుత్ చౌర్యం నేరం, ప్రమాదకరమని..గణేశ్ మండపాల అవసరాలకు నిర్వాహకులు విధిగా విద్యుత్ కనెక్షన్లు తీసుకోవాలని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(టీఎస్ఎస్పీడీసీఎల్) సీఎండీ జి.రఘుమారెడ్డి మంగళవారం తెలిపారు. ఈ నెల 13 నుంచి 23 వరకు 11 రోజుల పాటు జరుపనున్న వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసే మండపాలకు తాత్కాలిక ఎల్టీ విద్యుత్ కనెక్షన్ల జారీ కోసం నిర్ణీత రుసుం చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని నిర్వాహకులకు కోరారు. 250 వాట్ల వినియోగానికి రూ.500, 250–500 వాట్ల వినియోగానికి రూ.1000, 500–1000 వాట్ల వినియోగానికి రూ.1500, ఆపై వినియోగించే ప్రతి 500 వాట్లకు రూ.750 రుసుంను దరఖాస్తుతో పాటు చెల్లించాలన్నారు. దరఖాస్తుదారులు మీటర్డ్ విద్యుత్ సరఫరా కోరితే నిబంధనల ప్రకారం ఎల్టీ తాత్కాలిక విద్యుత్ కనెక్షన్ జారీ చేస్తారన్నారు. ప్రతి యూనిట్‌కు రూ.11 చొప్పున విద్యుత్ చార్జీలు వసూలు చేస్తామని, 21/కిలోవాట్/నెల చొప్పున ఫిక్స్డ్ చార్జీలు వర్తిస్తాయన్నారు. -
వంద రోజుల ప్రణాళిక
విద్యుత్ సరఫరాలో లోపాలను సవరించేందుకు రూపకల్పన ఊర్జా మిత్రా పథకాన్ని నల్లగొండ జిల్లాలోనే ప్రారంభించాలి మార్చి నెలాఖరు నాటికి వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల మంజూరు విద్యుత్ బిల్లుల వసూళ్లలో తిప్పర్తి ఏఈకి చార్జి మెమో విద్యుత్ శాఖ సమీక్ష సమావేశంలో సీఎండీ రఘుమారెడ్డి నల్లగొండ : విద్యుత్ సరఫరాలో లోపాలను సవరిం చేందుకు వంద రోజుల ప్రణాళిక రూపొం దించుకోవాలని విద్యుత్‌శాఖ సీఎండీ రఘుమారెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం నల్లగొండలో నిర్వహించిన విద్యుత్‌శాఖ సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యుత్ సమస్యలపై అసెంబ్లీలో చర్చకు వచ్చిన సందర్భంలో స్పందించిన సీఎం కేసీఆర్ వంద రోజుల ప్రణాళికకు రూపకల్పన చేశారన్నారు. దీనిలో భాగంగా నేలకొరిగిన విద్యుత్ స్తంభాలు, అవసరమైన చోట కొత్త వాటిని ఏర్పాటు చేయాలని వేలాడుతున్న విద్యుత్ తీగలను పటిష్టం చేసేందుకు ఎస్టిమేట్లు సిద్ధం చేసి వంద రోజుల కార్యాచరణతో వాటిని పూర్తిచేయాలని సీఎండీ ఆదేశించారు. సీఎం కే సీఆర్ ప్రత్యేక శ్రద్ధతో తీసుకున్న కార్యక్రమం కావున అధికారులు వేగవంతంగా పనిచేయాలని సూచించారు. కేంద్రం ప్రవేశపెట్టిన ఊర్జామిత్ర పథకాన్ని నల్లగొండ జిల్లా నుంచి ప్రారంభిస్తామని చెప్పారు. ఈ పథకంలో భాగంగా వినియోగదారుల మొబైల్ నంబర్లు, విద్యుత్ సర్వర్లకు అనుసంధానం చేసే ప్రక్రియ 52 శాతం పూర్తయిందన్నారు. రాష్ట్రంలో నల్లగొండ సర్కిల్ మొదటి స్థానంలో ఉన్నందున ఈ నెలాఖరులోగా మిగిలిన 31 శాతం లక్ష్యాన్ని పూర్తిచేయాలని తెలిపారు. కొత్త వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు, పెండింగ్‌లో ఉన్న వాటిని మార్చి 31 నాటికి మంజూరు చేయాలన్నారు. విద్యుత్ బిల్లులు వందశాతం వసూలు చేయాలని డిసెంబర్లో 98 శాతమే వసూలు కావడం పట్ల అధికారులను సీఎండీ మందలించారు. తిప్పర్తి మండలంలో విద్యుత్ బిల్లులు 82 శాతం మాత్రమే వసూలు కావడంతో సంబంధిత ఏఈకి చార్జి మెమో జారీ చేయాలని సీఎండీ ఆదేశించారు. ఈ సమావేశంలో డైరెక్టర్లు శ్రీనివాస్ రెడ్డి, శ్రీనివాస్, ఎస్ఈ భిక్షపతి, గోవర్దన్, ఏఈలు, డీఈలు తదితరులు పాల్గొన్నారు. -
మా మద్దతు టీఆర్ఎస్కే..
అమరవీరుల కుటుంబాల ఐక్య వేదిక అధ్యక్షుడు రఘుమారెడ్డి ఆర్మూర్, ఈ ఎన్నికలలో తమ మద్దతు టీఆర్ఎస్కే ఉంటుందని అమరవీరుల కుటుంబాల రాష్ట్ర ఐక్యవేదిక అధ్యక్షుడు రఘుమారెడ్డి అన్నారు. ఈ నెల 16న మెదక్ జిల్లా సంగారెడ్డిలో ప్రారంభమైన అమరవీరుల ఆశయసాధన బస్సుయాత్ర శుక్రవారం నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌కు చేరుకోగా, టీఆర్ఎస్ అసెంబ్లీ అభ్యర్థి జీవన్‌రెడ్డి స్వాగతం పలికారు. రఘుమారెడ్డితోపాటు తెలంగాణ అమరుల కుటుంబాల సంరక్షణ స్మారక సేవా సంస్థ అధ్యక్షుడు నర్సింహారెడ్డి, 70 కుటుంబాల సభ్యులు విలేకరులతో మాట్లాడారు. ఈ ఎన్నికల్లోక బీజేపి టీడీపీలకు బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు.