పంజాగుట్ట: హైదరాబాద్ నగర పరిధిలో ఏర్పాటు చేసుకునే వినాయక మండపాలకు ఎలాంటి పోలీస్ అనుమతి అవసరం లేదని, సంబంధిత పోలీస్‌స్టేషన్‌లలో సమాచారం ఇస్తే సరిపోతుందని భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి అధ్యక్షుడు జి.రాఘవరెడ్డి తెలిపారు. బుధవారం ఎర్రమంజిల్‌లోని హోటల్ ఎన్‌కెఎమ్ గ్రాండ్‌లో భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి భగవత్‌రావు, ఉపాధ్యక్షుడు నర్సింగ్, ఖైరతాబాద్ గణేశ్ సమితి అధ్యక్షుడు సుదర్శన్‌లతో కలసి ఆయన మాట్లాడారు.
అనుమతుల పేరుతో పోలీసులు వేధింపులు ఆపాలని కోరారు. అన్ని మండపాలకు ప్రభుత్వం ఉచితంగా కరెంట్ అందించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 17న విగ్రహ ప్రతిష్టాపనతో ఉత్సవాలు ప్రారంభమవుతాయని, 27న సామూహిక నిమజ్జనోత్సవం ట్యాంక్‌బండ్‌లో ఉంటుందని వివరించారు.
'గణేశ్ మండపాలపై పోలీసులకు సమాచారం ఇస్తే చాలు'
Published Wed, Sep 2 2015 7:02 PM | Last Updated on Tue, Aug 21 2018 5:51 PM
Advertisement