
గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
హైదరాబాద్ : గుర్తుతెలియని వ్యక్తిని అతి కిరాతకంగా హత్య చేసి పొదల్లో పారేసిన సంఘటన హైదరాబాద్ జీడిమెట్ల హెచ్‌ఎంటీ కాలనీలో గల నిర్జన ప్రదేశంలో శనివారం వెలుగులోకి వచ్చింది. మృతదేహాన్ని గమనించిన స్థానికలు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు.
కాగా.. హత్యకు పాల్పడిన దుండగులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారని, ప్రస్తుతం వారిని విచారిస్తున్నారని సమాచారం. వివాహేతర సంబంధం నేపథ్యంలోనే ఈ హత్య జరిగనట్లుగా తెలుస్తోంది.