జీడిమెట్ల ఆంధ్రాబ్యాంకులో చోరీకి పాల్పడిన ఇద్దరు దొంగలను పోలీసుల చాకచక్యంగా పట్టుకున్నారు.
హైదరాబాద్: జీడిమెట్ల ఆంధ్రాబ్యాంకులో చోరీకి పాల్పడిన ఇద్దరు దొంగలను పోలీసుల చాకచక్యంగా పట్టుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాలు.. శుక్రవారం ఉదయం 5 గంటల సమయంలో ఆంధ్రాబ్యాంకులో ఇద్దరు దొంగలు చొరబడ్డారు. బ్యాంకుకు సమీపంలోనే నివాసముంటున్న తమసయ్య అనే ఆర్టీసీ డ్రైవర్ బ్యాంకులో లైటు వెలుగుతుండటం గమనించాడు. బ్యాంకు దగ్గరికి వెళ్లి చూడగా షట్టర్ తాళాలు పగలగొట్టి ఉన్నాయి. ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేశాడు. బయటి వ్యక్తులు తమను గమనించారని తెలుసుకున్న దొంగలు పరారయ్యారు. ఇందులో ఓ వ్యక్తిని పోలీసుల సహాయంతో ఆర్టీసీ డ్రైవర్ తమసయ్య పట్టుకున్నారు. తర్వాత పరారైన వ్యక్తిని పట్టుబడిన వ్యక్తి సహాయంతో అరెస్ట్ చేశారు. ఇద్దరు దొంగలను నిజామాబాద్ జిల్లాకు చెందిన తుడుం స్వామి(25), సడుగు నవీన్(21)లుగా గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.