జీడిమెట్ల (హైదరాబాద్) : హైదరాబాద్ జీడిమెట్ల పారిశ్రామికవాడలో గురువారం స్వల్ప అగ్నిప్రమాదం సంభవించింది. పారిశ్రామిక వాడలోని ఒక రసాయనాల పరిశ్రమలో అగ్నిప్రమాదం జరిగినట్లు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందింది. విషయం తెలిసిన అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. కాగా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.