హైదరాబాద్: వేరే మహిళతో అక్రమ సంబంధాన్ని బయటపెట్టిన భార్య బంధువులపై భర్త కత్తితో దాడి చేసి గాయపరిచిన ఘటన జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.సీఐ పవన్ తెలిపిన వివరాల ప్రకారం.. గాజులరామారం వల్లభాయ్‌నగర్‌కు చెందిన విజయ్‌కుమార్‌కు మెదక్ జిల్లా చేగుంట మండలం నార్సింగికి చెందిన స్వప్నతో 16 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ముగ్గురు పిల్లలున్నారు. కాగా విజయ్‌కుమార్ మూడేళ్లుగా మరో మహిళతో అక్రమ సంబంధం కొనసాగిస్తూ వస్తున్నాడు. అప్పటి నుంచి భార్యను సైతం దూరం పెడుతూ విడాకులు ఇవ్వాల్సిందిగా వేధిస్తూ వస్తున్నాడు. కొన్ని నెలలుగా ఇంటి రావడంలేదు, కుటుంబ సభ్యులు ఫోన్లు చేసినా స్పందించడం లేదు.
శనివారం రాత్రి సదరు మహిళతో విజయ్‌కుమార్ ఉన్నట్లు తెలుసుకున్న స్వప్న, ఆమె అక్కలు శ్యామల, మంజుల, బాబాయి శ్రీనివాస్ అక్కడికి వెళ్లారు. అతడిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని నిలదీయగా వారి మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో భార్య స్వప్నను కొడుతున్న విజయ్‌కుమార్‌ను అడ్డుకున్న శ్రీనివాస్‌పై కత్తితో దాడి చేయగా అతని మెడభాగం, చేతిపై తీవ్ర గాయాలయ్యాయి. దీంతో క్షతగాత్రుడిని సమీపంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరి్పంచి చికిత్స అందిస్తున్నారు. ఆదివారం బాధిత మహిళ స్వప్న జీడిమెట్ల పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment