ఇంటి నుంచి కళాశాలకు వెళ్లిన ఓ యువతి అదృశ్యమైన ఘటన జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
జీడిమెట్ల(హైదరాబాద్): ఇంటి నుంచి కళాశాలకు వెళ్లిన ఓ యువతి అదృశ్యమైన ఘటన జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై వీరబాబు తెలిపిన వివరాల ప్రకారం..గాజులరామారం డివిజన్ హెచ్‌ఏఎల్ కాలనీకి చెందిన రాములు కుమార్తె మౌనిక(19) చింతల్‌లోని ఓ కళాశాలలో డిగ్రీ చదువుతోంది. శనివారం ఉదయం ఇంటి నుంచి కళాశాలకు వెళ్తున్నానని చెప్పిన వెళ్లిన మౌనిక తిరిగి ఇంటికి రాలేదు.
దీంతో తల్లిదండ్రులు చుట్టు పక్కల స్నేహితుల ఇళ్ల వద్ద వాకబు చేసినా ఫలితం లేకపోవడంతో ఆదివారం తండ్రి రాములు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.