మహిళతో వివాహేతర సంబంధం, పెళ్లయ్యాక సీన్‌ రివర్స్‌.. చివరికి! | Couple Assassinated married Woman over Extra Marital Affair In jeedimetla | Sakshi
Sakshi News home page

మహిళతో యువకుడి వివాహేతర సంబంధం, పెళ్లయ్యాక సీన్‌ రివర్స్‌.. చివరికి!

Aug 14 2021 11:57 AM | Updated on Aug 14 2021 1:44 PM

Couple Assassinated married Woman over Extra Marital Affair In jeedimetla - Sakshi

సాక్షి, జీడిమెట్ల: ఓ వివాహిత హత్య కేసును జీడిమెట్ల పోలీసులు ఛేదించి ఇద్దరు నిందితులను రిమాండ్‌కు పంపారు.. పోలీసులు తెలిపిన వివరాలు.. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం అజాంగర్‌ జిల్లా లోనాపార్క్‌కు చెందిన సుజీత్‌యాదవ్‌ (35), రింకూ యాదవ్‌ (24) భార్యాభర్తలు. వీరు జీడిమెట్ల వినాయనగర్‌లో ఉంటున్నారు. సుజీత్‌ యాదవ్‌ ఆటో డ్రైవర్‌. అయితే కూకట్‌పల్లిలో ప్రైవేట్‌ ఉద్యోగం చేసే రాజేష్‌ అనే వ్యక్తి గత 5 సంవత్సరాలుగా వీరితో షేరింగ్‌ రూమ్‌లో  ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో రింకూ యాదవ్, రాజేష్‌ల మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. దీంతో రాజేష్‌ ఆమెకు ఆర్థికంగా సాయం చేస్తుండే వాడు.

అయితే ఏప్రిల్‌లో రాజేష్‌కు ధన్‌బాద్‌కు చెందిన పూజాతో వివాహమైంది. వివాహానంతరం రాజేష్‌, పూజలు అదే ఇంట్లో ఉంటున్నారు. పెళ్లి కావడంతో రాజేష్‌.. రింకూ యాదవ్‌ను పట్టించుకోవడం మానేశాడు. ఇంకో ఇంటికి మారేందుకు సిద్ధమవుతున్నాడు. దీంతో రాజేష్‌ను తన వైపునకు తిప్పుకోవాలంటే పూజ అడ్డును తొలగించుకోవాలని రింకూ యాదవ్‌ దంపతులు భావించారు. ఈ నెల 10 తేదీన రాజేష్‌ పని మీద బయటకు వెళ్లగా పూజ ఒకత్తే ఉంది. ఇదే సరైన సమయంగా భావించిన రింకూయాదవ్, సుజీత్‌యాదవ్‌లు  పూజముఖంపై దిండుతో ఊపిరాడకకుండా చేసి  హత్య చేశారు. ఆపై నేరం తమపైకి రాకుండా పూజ వంటి మీద ఉన్న బంగారు ఆభరణాలను కాజేశారు.

కొద్దిసేపటి తరువాత వచ్చిన రాజేష్‌కు కట్టుకథ అల్లారు. పూజ మాజీ ప్రియుడు వచ్చి తనతో పాటు రమ్మని బలవంతం చేశాడని, రానని చెప్పడంతో హత్య చేసి వెళ్లిపోయాడని నమ్మించారు. ఈ విషయమై కేసు నమోదు చేసిన జీడిమెట్ల పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా రింకూయాదవ్, సుజీత్‌యాదవ్‌లను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా తామే పూజను హత్య చేసినట్లు అంగీకరించారు. వారి వద్ద నుంచి బంగారు లాకెట్‌ను స్వాదీనం చేసుకుని, ఇరువురిని శుక్రవారం రిమాండ్‌కు తరలించారు. 

చదవండి: పెళ్లైన తర్వాత.. ప్రియుడితో ఫోన్‌కాల్స్‌.. చాటింగ్‌..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement