Woman Muder
-
బెంగళూరు హోటల్లో ఉజ్బెక్ మహిళ హత్య
బనశంకరి: బెంగళూరులోని ఓ హోటల్లో విదేశీ మహిళ హత్యకు గురయ్యారు. శేషాద్రిపురం పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం రాత్రి వెలుగుచూసింది. ఉజ్బెకిస్తాన్‌కు చెందిన జరీనా (37) వ్యాపార వీసాపై నాలుగు రోజుల క్రితం బెంగళూరుకు వచ్చారు. బుధవారం మధ్యాహ్నం శేషాద్రిపురంలో ఓ హోటల్ రెండో అంతస్తు గదిలో బస చేశారు. బుధవారం రాత్రి 10:30 గంటలైనా ఆమె బయటకు రాలేదు. అనుమానం వచి్చన హోటల్ సిబ్బంది మాస్టర్ కీ ద్వారా తెలుపు తెరిచారు. లోపల చూడగా జరీనా విగతజీవిగా కనిపించారు. వారిచ్చిన సమాచారంతో పోలీసులు ఆధారాలు సేకరించి, సీసీ ఫుటేజీ, సెల్ కాల్‌డేటా ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. ఎవరో గొంతు నులిమి చంపి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. -
వివాహేతర సంబంధం: నీవు ఏమన్నా నాకు తాళికట్టిన మొగుడివా..?
మదనపల్లె : మండలంలోని తట్టివారిపల్లె చెరువు మొరవలో అనుమానాస్పద స్థితిలో లభ్యమైన మహిళ మృతదేహానికి సంబంధించి జరిపిన దర్యాప్తులో హత్య జరిగినట్లు పోలీసులు నిర్ధారించుకున్నారు. ఈమేరకు నిందితుడిని అరెస్ట్ చేసినట్లు తాలూకా సీఐ ఎన్.శేఖర్ తెలిపారు. శనివారం తాలూకా పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. ఈనెల 13న తట్టివారిపల్లె చెరువు మొరవలో మహిళ మృతదేహం అనుమానాస్పద స్థితిలో పడి ఉందన్న సమాచారం మేరకు సిబ్బందితో వెళ్లి పరిశీలించామన్నారు. మృతదేహం కుళ్లిపోయి, తరలించేందుకు వీలులేని స్థితిలో ఉండటంతో అక్కడే పోస్టుమార్టం నిర్వహించి, అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశామన్నారు. మృతదేహం లభించిన ప్రదేశంలో దొరికిన వస్తువుల ఆధారంగా కేసు దర్యాప్తు ప్రారంభించామన్నారు. మృతురాలు నిమ్మనపల్లె మండలం తవళం పంచాయతీ ముతకనబండకు చెందిన సుబ్రహ్మణ్యం భార్య కత్తి భూదేవి(44)గా గుర్తించామన్నారు. భర్త చనిపోవడంతో జీవనోపాధి కోసం గ్రామాన్ని వదలి పట్టణంలో చిత్తుకాగితాలు, వాటర్‌బాటిల్స్ ఏరుకుని అమ్మి జీవనం సాగించేందన్నారు. ఈ క్రమంలో గుజిరీ వృత్తిగా జీవిస్తున్న కురబలకోట మండలం తెట్టుపంచాయతీ దొమ్మన్నబావికి చెందిన శ్రీనివాసులు(36)కు పరిచయం కావడంతో ఇద్దరూ సహజీవనం చేసేవారన్నారు. రోజంతా గుజిరీ సామానులు ఏరుకోవడం, వచ్చిన ఆదాయంతో భోజనం తినడం, మద్యం సేవించడం చేసేవారన్నారు. ఈ నేపథ్యంలో భూదేవి మరొకరితో చనువుగా ఉండటాన్ని శ్రీనివాసులు గమనించాడు. ఘటనకు 15 రోజుల ముందు భూదేవి, శ్రీనివాసులు తట్టివారిపల్లె చెరువు కట్ట వద్దకు మధ్యాహ్నసమయంలో వెళ్లి భోజనం చేసి మద్యం సేవించారు. మత్తులో శ్రీనివాసులు, భూదేవి అక్రమ సంబంధంపై నిలదీశాడు. తాను ఉండగా, మరొక వ్యక్తితో అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించాడు. దీనికి భూదేవి నీవు ఏమన్నా నాకు తాళికట్టిన మొగుడివా..? నా ఇష్టం వచ్చినట్లు చేస్తాను. అడగడానికి నీవెవరివి అని ఎదురుతిరగడంతో ఆగ్రహించిన శ్రీనివాసులు భూదేవిని కొట్టాడు. దీంతో భూదేవి తిరగబడి కర్రతో శ్రీనివాసులుపై దాడిచేసింది. దాడిలో అతని చెవికి గాయం కావడంతో, పట్టరాని కోపంలో పక్కనే ఉన్న బండరాయిని తీసుకుని భూదేవి తలపై మోదాడు. దీంతో ఆమె అక్కడికక్కడే చనిపోగా, నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. మృతదేహం కుళ్లిన స్థితిలో స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించడంతో మొదట అనుమానాస్పద మృతిగా కేసు నమోదుచేసి విచారణలో భాగంగా హత్యకేసుగా మార్చినట్లు సీఐ తెలిపారు. మృతురాలు దళిత మహిళ కావడంతో హత్యకేసుతో పాటు ఎస్సీ, ఎస్టీ కేసు నమోదుచేసి, ఎస్సీ,ఎస్టీ సెల్ డీఎస్పీకి అప్పగించామన్నారు. నిందితుడిని శనివారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపామన్నారు. కేసు దర్యాప్తులో ఎస్ఐ సుధాకర్, రవికుమార్, ఏఎస్ఐ సుబ్రహ్మణ్యం, హెడ్‌కానిస్టేబుల్ జయచంద్ర, కానిస్టేబుల్ ప్రభాకర్‌లు బృందంగా ఏర్పడి సమర్ధవంతంగా పనిచేసి హంతకుడి అరెస్ట్‌లో కీలకంగా వ్యవహరించారని పేర్కొన్నారు. -
మహిళ హత్య కేసు మిస్టరీ.. అనుమానం నిజమైంది..
చిత్తూరు రూరల్: మండలంలోని బీఎన్ఆర్ పేట వద్ద వారం క్రితం వెలుగుచూసిన మహిళ హత్య కేసులో భర్తే నిందితుడని పోలీసులు నిర్ధారించారు. ఈ మేరకు శుక్రవారం చిత్తూరు తాలూకా పోలీస్‌స్టేషన్‌లో సీఐ బాలయ్య, ఎస్ఐ రామకృష్ణ వివరాలు వెల్లడించారు. జీడీనెల్లూరు మండలం నల్లరాళ్లపల్లెకు చెందిన చిన్నబ్బ మందడి కుమార్తె మోహన అలియాస్ రోజా(23)కు చిత్తూరు మండలం కుర్చివేడు పంచాయతీ వీఎన్‌పురం గ్రామానికి చెందిన ప్రకాష్‌తో రెండేళ్ల క్రితం వివాహమైంది. చదవండి: సంతోషంగా వధూవరులు డ్యాన్స్.. పెళ్లయిన కొద్దిసేపటికే విషాదం.. కొంత కాలానికే భార్యాభర్తల మధ్య కలహాలు ప్రారంభమయ్యాయి. ప్రకాష్ రోజూ తాగి వచ్చి రోజాను వేధించేవాడు. దీంతో అప్పుడప్పుడు ఆమె మనస్తాపంతో పుట్టింటికి వెళ్లిపోయి కొన్నిరోజులు ఉండి వచ్చేది. ఈక్రమంలో ఇటీవల మళ్లీ భర్తతో గొడవపడి పుట్టింటికి వచ్చింది. ఈ క్రమంలో ఈ నెల 17వ తేదీన తండ్రి వద్దని వారించినా వినకుండా ప్రకాష్ ఇంటికి వెళ్లింది. అదే రోజు సాయంత్రం ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో రోజా ఇక్కడ తాను ఉండలేనని తండ్రి వద్దకు వెళ్లిపోతానంటూ కాలినడకనే బయలుదేరింది. బైక్‌పై ఆమె వెనుకే వచ్చిన ప్రకాష్ మార్గం మధ్యలో అడ్డుకున్నాడు. మాటామాటా పెరగడంతో దగ్గరలోని బండరాయి తీసుకుని రోజా తలపై మోదాడు. ప్రాణాలు పోకపోవడంతో చున్నీతో గొంతు బిగించి హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని చెరువులో పడేశాడు. 18వ తేదీ సాయంత్రం అటు వైపు వెళ్లిన స్థానికులు తేలుతున్న మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెలికితీసిన పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. మూడు రోజుల తర్వాత ‘సాక్షి’ పత్రికలో వచ్చిన వార్త ఆధారంగా రోజా తల్లిదండ్రులు పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. అక్కడ పోలీసులు చూపించిన రోజా తాళిబొట్టు, ఇతర ఆధారాలను చూసి తమ కూతురే అని నిర్ధారించారు. రోజాను ఆమె భర్తే చంపేసుంటాడని అనుమానం వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు ప్రకాష్, మరో ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారించారు. రోజా భర్త ప్రకాషే నిందితుడని తేలడంతో మిగిలిని ఇద్దరినీ విడిచిపెట్టేశారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. -
భర్తతో విడిపోయి.. వంశీతో సహజీవనం.. చివరకు అతడి చేతిలోనే..
నెల్లూరు(క్రైమ్): సహజీవనం చేస్తున్న యువకుడే ఆమె పాలిట కాలయముడయ్యాడు. గొంతు నులిమి.. నాలుగో అంతస్తు నుంచి కిందకు తోసేశాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ఘటన 14వ తేదీ అర్ధరాత్రి నెల్లూరులోని భగత్‌సింగ్‌కాలనీ టిడ్కో ఇళ్లలో చోటుచేసుకుంది. బుధవారం పోలీసులు వివరాలు వెల్లడించారు. దర్గామిట్ట రామ్‌నగర్‌కు చెందిన రమణ (31), వెంకటరమణలు దంపతులు. వారికి ఒక కుమారుడున్నాడు. విభేదాల నేపథ్యంలో భార్యాభర్తలు విడిపోయారు. రమణ తన కుమారుడిని ఇందుకూరుపేటలోని డానియేల్ ఫౌండేషన్ వసతిగృహంలో చేర్పించి ఒంటరిగా నివాసం ఉంటోంది. ఈక్రమంలో ఆమెకు చిల్లకూరు మండలం మిక్చర్ కాలనీకి చెందిన వీడీ వంశీతో రెండున్నర సంవత్సరాల క్రితం పరిచయం ఏర్పడింది. ఇద్దరూ సన్నిహితంగా ఉండసాగారు. చదవండి: (భర్తను వదిలి ప్రియుడితో సహజీవనం.. పిల్లలు అమ్మా అని...) కొంతకాలం కరెంటాఫీసు సెంటర్ గాయత్రినగర్‌లో సహజీవనం చేశారు. రెండునెలల క్రితం భగత్‌సింగ్‌కాలనీలోని టిడ్కో అపార్ట్మెంట్ జీ–4 బ్లాక్‌కు నివాసం మార్చారు. వంశీ కొంతకాలంగా రమణపై అనుమానం పెంచుకోవడంతోపాటు చీటికి మాటికి గొడవపడుతుండేవాడు. ఇటీవల నెల్లూరు రామ్‌నగర్‌లో నివాసం ఉంటున్న రమణ సోదరి గంగ తన కుమార్తెతో కలిసి వారి వద్దకు వచ్చింది. 14వ తేదీ అర్ధరాత్రి అందరూ కలిసి అపార్ట్‌మెంట్‌పైన నిద్రించేందుకు వెళ్లారు. ఈక్రమంలో వంశీ రమణతో గొడవపడ్డాడు. ఆమె గొంతు నులిమి అపార్ట్మెంట్ పైనుంచి కిందకు తోసేయడంతో అక్కడికక్కడే మృతిచెందారు. ఈ విషయాన్ని గమనించిన గంగ, ఆమె కుమార్తె నవాబుపేట పోలీసులకు సమాచారం అందించారు. ఇన్స్పెక్టర్ టీవీ సుబ్బారావు, ఎస్సై రమేష్‌బాబు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని జీజీహెచ్ మార్చురీకి తరలించారు. సుబ్బారావు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న వంశీ కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. -
మహిళతో వివాహేతర సంబంధం, పెళ్లయ్యాక సీన్ రివర్స్.. చివరికి!
సాక్షి, జీడిమెట్ల: ఓ వివాహిత హత్య కేసును జీడిమెట్ల పోలీసులు ఛేదించి ఇద్దరు నిందితులను రిమాండ్‌కు పంపారు.. పోలీసులు తెలిపిన వివరాలు.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అజాంగర్ జిల్లా లోనాపార్క్‌కు చెందిన సుజీత్‌యాదవ్ (35), రింకూ యాదవ్ (24) భార్యాభర్తలు. వీరు జీడిమెట్ల వినాయనగర్‌లో ఉంటున్నారు. సుజీత్ యాదవ్ ఆటో డ్రైవర్. అయితే కూకట్‌పల్లిలో ప్రైవేట్ ఉద్యోగం చేసే రాజేష్ అనే వ్యక్తి గత 5 సంవత్సరాలుగా వీరితో షేరింగ్ రూమ్‌లో ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో రింకూ యాదవ్, రాజేష్‌ల మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. దీంతో రాజేష్ ఆమెకు ఆర్థికంగా సాయం చేస్తుండే వాడు. అయితే ఏప్రిల్‌లో రాజేష్‌కు ధన్‌బాద్‌కు చెందిన పూజాతో వివాహమైంది. వివాహానంతరం రాజేష్, పూజలు అదే ఇంట్లో ఉంటున్నారు. పెళ్లి కావడంతో రాజేష్.. రింకూ యాదవ్‌ను పట్టించుకోవడం మానేశాడు. ఇంకో ఇంటికి మారేందుకు సిద్ధమవుతున్నాడు. దీంతో రాజేష్‌ను తన వైపునకు తిప్పుకోవాలంటే పూజ అడ్డును తొలగించుకోవాలని రింకూ యాదవ్ దంపతులు భావించారు. ఈ నెల 10 తేదీన రాజేష్ పని మీద బయటకు వెళ్లగా పూజ ఒకత్తే ఉంది. ఇదే సరైన సమయంగా భావించిన రింకూయాదవ్, సుజీత్‌యాదవ్‌లు పూజముఖంపై దిండుతో ఊపిరాడకకుండా చేసి హత్య చేశారు. ఆపై నేరం తమపైకి రాకుండా పూజ వంటి మీద ఉన్న బంగారు ఆభరణాలను కాజేశారు. కొద్దిసేపటి తరువాత వచ్చిన రాజేష్‌కు కట్టుకథ అల్లారు. పూజ మాజీ ప్రియుడు వచ్చి తనతో పాటు రమ్మని బలవంతం చేశాడని, రానని చెప్పడంతో హత్య చేసి వెళ్లిపోయాడని నమ్మించారు. ఈ విషయమై కేసు నమోదు చేసిన జీడిమెట్ల పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా రింకూయాదవ్, సుజీత్‌యాదవ్‌లను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా తామే పూజను హత్య చేసినట్లు అంగీకరించారు. వారి వద్ద నుంచి బంగారు లాకెట్‌ను స్వాదీనం చేసుకుని, ఇరువురిని శుక్రవారం రిమాండ్‌కు తరలించారు. చదవండి: పెళ్లైన తర్వాత.. ప్రియుడితో ఫోన్‌కాల్స్.. చాటింగ్.. -
గృహిణి దారుణ హత్య
మల్కాపురం(విశాఖ పశ్చిమ): పారిశ్రామిక ప్రాంతంలో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. ఆమె ఇంటికి వచ్చిన గుర్తు తెలియని వ్యక్తి ఈ దురాగతానికి పాల్పడి ఉంటాడని స్థానికులు భావిస్తున్నారు. స్థానికులు, మల్కాపురం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి ప్రాంతానికి చెందిన సాహుకారి రమేష్‌కుమార్ మర్చంట్ నేవీలో కొన్నేళ్లుగా పని చేస్తున్నాడు. అతను భార్య సాహుకారి అలేఖ్య(30), ఆరేళ్ల కుమార్తె అనీషా, మూడేళ్ల కుమారుడు తనేశ్వర్‌తో కలిసి 48వ వార్డు ప్రియదర్శిని కాలనీలో కొంత కాలంగా నివాసముంటున్నాడు. ఇటీవల రమేష్‌కుమార్ విధులకు వెళ్లాడు. (మర్చంట్ నేవీ కావడంతో నెలల తరబడి షిప్‌లోనే విధులు నిర్వర్తిస్తుంటారు.) దీంతో కుమారుడు, కుమార్తెతో అలేఖ్య ఇంటిలో ఉంటోంది. ఈ నేపథ్యంలో అలేఖ్య ఇంటికి బుధవారం రాత్రి ఓ గుర్తు తెలియని వ్యక్తి వ్యక్తి వచ్చాడు. ఆ వ్యక్తి అలేఖ్య బంధువా, లేదా మరే ఇతర సంబంధం కలిగిన వ్యక్తా అన్నది పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది. అయితే ఆ వ్యక్తి బుధవారం రాత్రి అంతా వారి ఇంట్లో గడిపాడు. గురువారం ఉదయం పది గంటల వరకు ఇంట్లోనే ఉన్నాడని స్థానికులు చెబుతున్నారు. అనంతరం గురువారం ఉదయం 11 గంటల సమయంలో అలేఖ్య మూడేళ్ల కుమారుడు ఏడుస్తుండడంతో ఎదురు ఇంట్లో ఉంటున్న ఓ వృద్ధురాలు అలేఖ్య ఇంటి తలుపు తట్టి... బాబు ఏడుస్తుంటే ఏం చేస్తున్నావని కేకలు వేసింది. అయినప్పటికీ స్పందన లేకపోవడంతో ఇంట్లోకి వెళ్లి చూడగా బాత్రూమ్ వద్ద పడి ఉన్న అలేఖ్యను చూసి వృద్ధురాలు షాక్‌కు గురైంది. అదుపుతప్పి పడిపోయింది ఏమో అని భావించి ఇరుగుపొరుగు వారిని పిలిచింది. వారు వచ్చి అక్కడ పడిపోయిన అలేఖ్యను మంచం మీద పడుకోబెట్టేందుకు యత్నించగా ఆమె మెడపై తాడుతో బిగించిన ముద్ర ఉండటంతో వెంటనే స్థానిక మహిళా సంఘ ప్రతినిధి రజియాభేగంకు విషయం తెలియజేశారు. ఆమె మల్కాపురం పోలీసులకు ఫోన్లో సమాచారం ఇవ్వడంతో వారు అక్కడకు వచ్చి వివరాలు సేకరించారు. డాగ్ స్కాడ్ బృందం వచ్చి పరిశీలించింది. అలేఖ్య ఇంటికి వచ్చిన గుర్తు తెలియని వ్యక్తి కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆ గుర్తు తెలియని వ్యక్తికి, అలేఖ్యకు మధ్య ఉన్న సంబంధం ఏమిటి..? ఆ సంబంధమే హత్యకు దారి తీసిందా..? లేక మరే ఇతర కారణం వల్లైనా హత్యకు గురైందా..? అని పోలీసులు ఆరా తీస్తున్నారు. స్థానికుల సహకారంతో గుర్తు తెలియని వ్యక్తి ఊహాచిత్రం గీచేందుకు యత్నిస్తున్నారు. మరోవైపు మృతురాలు అలేఖ్య ఫోన్ లాక్ తెరిచి అందులోని సమచారం ఆధారంగా కేసు దర్యాప్తు చేసేందుకు యత్నిస్తున్నారు. ఘటనా స్థలిని ఏసీపీ రామ్మోహన్రావు పరిశీలించారు. మల్కాపురం సీఐ ఉదయ్‌కుమార్ ఆధ్వర్యంలో కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
మరీ ఇంత రాక్షసత్వమా?
కిరాతకం, రాక్షసత్వం, దారుణాతి దారుణం, ఘోరాతి ఘోరం... మనిషి సాగిస్తున్న మారణహోమానికి ఇలాంటి పదాలు కూడా సరిపోవు. క్రూర మృగాలు తమ మనుగడ కోసం సాటి జీవులను వేటాడతాయి. బుద్ధిజీవి మనిషి మాత్రం పగ సాధించడం కోసం తోటి మనిషి ప్రాణాలు తోడేస్తున్నాడు. వర్తమాన సమాజంలో జరుగుతున్న దారుణాలు ఈ విషయాన్ని రుజువు చేస్తున్నాయి. హైదరాబాద్ లో జరిగిన ఓ మహిళ హత్యోదంతం ఇందుకు సజీవ సాక్ష్యం. అంబర్‌పేట్‌కు చెందిన సునీత అనే మహిళ దారుణ హత్యకు గురైంది. ఈ కేసులో వెలుగుచూసిన వాస్తవాలు ఒల్లుజలదరించేలా ఉన్నాయి. జూన్ 16న అదృశ్యమైన ఆమెను చంపించింది ఓ మహిళే అన్న నిజం అందరినీ నిశ్చేష్టపరిచింది. సునీత భర్త కృష్ణపై పగ సాధించేందుకు ఆయన వ్యాపార మాజీ భాగస్వామి విజయారెడ్డి ఈ కిరాతానికి పూనుకుంది. తన స్నేహితుడు జగన్నాథనాయుడు సాయంతో సునీతను అంతమొందించింది. జగన్నాథనాయుడు సునీతను హత్య చేసి మృతదేహాన్ని ముక్కలుగా చేసి మూసీలో పడేశాడని తెలియడంతో అంతా నివ్వెరపోయారు. అయితే కృష్ణ, సునీతల గారాలపట్టి శ్రావణి(10)ని అపహరించి, హతమార్చాలన్న కర్కశుల వ్యూహం ఫలించకపోవడంతో ఆ చిన్నారి బతికిపోయింది. చివరకు ఆమె తల్లిని బలితీసుకున్నారు. మనుషుల్లో క్షీణిస్తున్న మానవతా విలువలకు ఈ ఉదంతం అద్దం పడుతోంది. ఆధునిక మానవుడు ఇంతటి దారుణాలకు తెగ బడడం అందరినీ భయాందోళనకు గురిచేస్తోంది. పగ సాధించడం కోసం ఇంత రాక్షసంగా మారాలా?