
సాక్షి, హైదరాబాద్: జీడిమెట్లలో ఓ బాలిక అనుమానాస్పద మృతి చెందిండం కలకలం రేపుతోంది. సుభాష్ నగర్‌కు చెందిన 17 ఏళ్ల బాలిక సోమవారం రాత్రి ఇంట్లో నుంచి ఆదృశ్యమైంది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు బాలిక ఆచూకీ కోసం వెతుకుతుండగా మంగళవారం తెల్లవారుజామున బాలిక మృతుహదేహం లభ్యమమైంది. జీడిమెట్ల పైప్ లైన్ రోడ్డులోని నిర్మాణంలో ఉన్న ఓ భవనంలో రక్తపు మడుగుల్లో బాలిక మృతదేహం కనిపించింది. సమాచారం అందుకున్న జీడిమెట్ల పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. బాలికను హత్య చేశారన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. డాగ్ స్వాడ్, క్లూస్ టీంతో తనిఖీలు చేపట్టారు. అనుమానితులను, భవన నిర్మాణ కార్మికులు, స్థానికులను పోలీసులు ప్రశ్నిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment