![Young Man Committed Suicide Due To Girl refused His Love In Jeedimetla - Sakshi](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2021/09/3/suicidee.jpg.webp?itok=HOUWSHJX)
ఫైల్ ఫోటో
సాక్షి, జీడిమెట్ల: అమ్మాయి తన ప్రేమను నిరాకరించిందని ఓ యువకుడు ఉరి వేసుకుని అత్మహత్య చేసుకున్న సంఘటన జీడిమెట్ల పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. చింతల్ ద్వారకానగర్‌కు చెందిన యాదగిరి కుమారుడు మహేష్ (21) ఏసీ మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. కొన్ని నెలలుగా అదే ప్రాంతానికి చెందిన ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. ఈ విషయాన్ని మహేష్ సదరు యువతికి తెలుపగా నిరాకరించింది.
దీంతో మదనపడిన మహేష్ గురువారం ఇంట్లో ఎవరూలేని సమయంలో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకుని అత్మహత్య చేసుకున్నాడు. మృతుని తల్లి మధ్యాహ్నం ఇంటికి వచ్చి చూసే సరికి మహేష్ మరణించి ఉన్నాడు. మృతుని తండ్రి యాదగిరి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
చదవండి: ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావుపై కేసు నమోదు
భర్తకు వీడియో కాల్ చేసి భార్య ఆత్మహత్య
Comments
Please login to add a commentAdd a comment