Love problem
-
బంధువుల అమ్మాయితో ప్రేమ.. ప్రేయసి బర్త్‌డే అని ఇంటికి వెళ్తే
సాక్షి, హైదరాబాద్: ప్రేమ విఫలమై తీవ్ర మనోవేదనకు గురైన యువకుడు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన తుకారాంగేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ ఎల్లప్ప తెలిపిన వివరాల మేరకు.. అడ్డగుట్ట సీ సెక్షన్ ప్రాంతానికి చెందిన అరుణ్‌కుమార్(21) ఉద్యోగం మానేసి రెండు నెలలుగా ఇంట్లోనే ఉంటున్నాడు. అరుణ్‌కు తన బంధువుల అమ్మాయితో ప్రేమ వ్యవహారం నడుస్తోంది. ఈ విషయం ఇరువురి కుటుంబ సభ్యులకు తెలియడంతో వారిని మందలించారు. అప్పటి నుంచి వాళ్లు కలుసుకోవడం లేదు. ఇటీవల తన ప్రేయసి బర్త్‌డే సందర్భంగా వారి ఇంటికి అరుణ్ వెళ్లగా ఆమె కుటుంబ సభ్యులు గట్టిగా మందలించడంతో కొంత కాలంగా అరుణ్ తీవ్ర మనోవేదనకు గురవుతున్నాడు. ఈ క్రమంలో మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు అతడి తండ్రికి క్యారేజ్ ఇచ్చి ఇంటికెళ్లిన అరుణ్ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే మరుసటి రోజు స్టోర్ రూమ్ తాళం తెరిచి ఉండడాన్ని గమనించిన అరుణ్ తండ్రి తలుపులు తీసేందుకు ప్రయత్నిచగా రాకపోవడంతో కిటికీలో నుంచి చూడగా అరుణ్ ఉరేసుకొని కనిపించాడు. వెంటనే తలుపులు బద్దలుగొట్టి అరుణ్‌ను స్థానిక ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. సమాచారం అందుకున్న తుకారాంగేట్ పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అరుణ్ -
కానిస్టేబుల్ కూతురు దారుణ హత్య.. కారణం అదేనా?
సాక్షి, చెన్నై: ప్రేమోన్మాది ఘాతుకానికి మరో విద్యార్థిని అసువులుబాసింది. పట్టపగలే రైల్వే స్టేషన్లో అందరూ చూస్తుండగా రైలు కింద తోసి ఓ యువతిని ప్రేమోన్మాది హతమార్చాడు. ఈ దారుణ ఘటన తమిళనాడులోని సెయింట్ థామస్ మౌంట్ రైల్వే స్టేషన్లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. రాష్ట్రవ్యాప్తంగా ప్రేమపేరుతో యువతులపై వేధింపులు, కిరాతకాలు నానాటికీ పెరుగుతున్నాయి. వన్‌సైడ్ ప్రేమ అంటూ కొందరు, తనను విస్మరించిందంటూ మరికొందరు యువకులు ఉన్మాదులుగా మారుతున్నారు. ముఖ్యంగా చెన్నైలోని రైల్వే స్టేషన్లలో కొంతకాలంగా ప్రేమ పేరిట జరుగుతున్న ఘాతుకాలు బాలికల భద్రతను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. కొన్నేళ్ల క్రితం రాంకుమార్ అనే ప్రేమోన్మాది చేతిలో స్వాతి అనే ఐటీ ఉద్యోగి నుంగంబాక్కం రైల్వే స్టేషన్లో అతి కిరాతకంగా హత్యకు గురైంది. ఆ తర్వాత మరి కొన్నాళ్లకు తేన్మొళి అనే యువతిని చేట్‌పట్ రైల్వే స్టేషన్లో మరో ఉన్మాది హత్య చేసేందుకు యత్నించాడు. రైలు వస్తుండగా.. గురువారం ఉదయం సెయింట్ థామస్ మౌంట్ ఎలక్ట్రిక్ రైల్వే స్టేషన్ ప్రయాణికులతో కిక్కిరిసి ఉంది. ఈ సమయంలో తాంబరం – బీచ్ మార్గంలోని ప్లాట్ ఫాంపై ఓ యువకుడు, యువతి చాలా సేపటి నుంచి వాదులాడుకుంటున్నారు. అదే సమయంలో ఆ ఫ్లాట్‌ఫాం వైపుగా రైలు దూసుకొస్తున్న సమయంలో ఆ యువకుడు ఉన్మాదిగా మారాడు. ఒక్కసారిగా యువతిని రైలు కింద తోసి పారిపోయాడు. అక్కడున్న వారు తేరుకునే లోపే ఆ యువతి రైలు చక్రాల కింద నలిగి దుర్మరణం చెందింది. ఇక, సత్యకు గతనెలలోనే నిశ్ఛితార్థం జరిగినట్లు వెల్లడించారు. గుర్తింపు కార్డు ఆధారంగా.. బాధిత యువతి మెడలో ఉన్న గుర్తింపు కార్డు ఆధారంగా ఆమెను ఆదంబాక్కంకు చెందిన ఎస్.సత్య(20)గా గుర్తించారు. స్థానికంగా ఉన్న ఓ కళాశాలలో బీకాం రెండో సంవత్సరం చదువుతున్నట్లు తేలింది. ఆమె తల్లి చెన్నైలోని ఓ పోలీసు స్టేషన్లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. నిందితుడిని సతీష్(32)గా గుర్తించారు. ఇతడు గత కొంత కాలంగా ప్రేమ పేరుతో సత్యను వేధిస్తున్నట్లు తెలిసింది. దీనిపై గతంలోనే సత్య పోలీసులకు సైతం ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో గురువారం రైలు వస్తుండగా.. పట్టాలపైకి తోసి హతమార్చి సతీష్ ఉడాయించాడు. కాగా, నిందితుడి స్పెషల్ టీమ్ పోలీసులు పట్టుకుని అరెస్ట్ చేసినట్టు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. మరోమారు.. గతంలో జరిగిన స్వాతి దారుణహత్య, తేన్‌మొళిపై హత్యాయత్నం వంటి ఘటనల నుంచి రైల్వే పోలీసులు పాఠం నేర్వలేదనే విమర్శలు వ్యక్తమవు తున్నాయి. స్టేషన్లలో భద్రతను పెంచుతామని అప్పట్లో ప్రకటించినా.. తర్వాత మిన్నకుండిపోయా రు. గంటల తరబడి రైల్వే స్టేషన్లలో ప్రేమజంటలు కాలక్షేపం చేస్తున్నా, మందలించే వారు లేకుండా పోయారనే విమర్శలు వ్యక్తమయ్యాయి. UPDATE | Tamil Nadu: Special team arrested accused Satish who allegedly pushed a girl in front of a train at St Thomas Mount railway station yesterday: Police officials https://t.co/XvOWPb7vWe— ANI (@ANI) October 14, 2022 -
ప్రాణం తీసిన ‘ప్రేమ’ పంచాయితీ
సాక్షి, జనగామ: ప్రేమించిన అమ్మాయితో వివాహానికి ఎకరం భూమి ఇవ్వాలని ఆమె తండ్రి డిమాండ్ చేయడంతో మనస్తాపానికి గురైన ప్రేమికుడు, అతని తల్లి పురుగుల మందు తాగారు. ఈ సంఘటనలో ప్రేమికుడు కన్నుమూయగా..అతని తల్లి ప్రాణాపాయం నుంచి బయట పడింది. పోలీసులు చెప్పిన వివరాల మేరకు..జనగామ జిల్లా పెద్దపహాడ్ గ్రామానికి చెందిన దండు సాయికుమార్(24), గోపిరాజుపల్లికి చెందిన అమ్మాయి ప్రేమించుకున్నారు. గత మే 13న పెళ్లి చేసుకున్నారు. అమ్మాయి తండ్రి తన కూతురు కనిపించడం లేదని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. దీంతో సాయికుమార్ దంపతులు రక్షణ కోసం పోలీసులను ఆశ్రయించగా ఉభయుల తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. దీంతో అమ్మాయి కుటుంబసభ్యులు.. తన ఇంటి దగ్గరే వివాహం ఘనంగా చేస్తామని చెప్పి కూతుర్ని తీసుకెళ్లారు. ఈనెల 1న అమ్మాయి భర్తకు ఫోన్‌చేసి తనను తీసుకెళ్లాలని కోరగా, 3న సాయికుమార్ వెంటనే పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు అమ్మాయి తల్లిదండ్రులను స్టేషన్‌కు పిలిపించగా.. తన కూతురును సాయి పోషించలేడని, పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడుకుంటామని చెప్పి అక్కడినుంచి వెళ్లిపోయారు. ఈనెల 4న సాయికుమార్ అన్న దండు బాబు, అమ్మాయి తరఫు కుటుంబసభ్యులు, పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీ పెట్టారు. తన కూతురు పేరిట ఎకరం పొలం రిజిస్ట్రేషన్ చేయాలని తండ్రి డిమాండ్ చేయగా, అందుకు సాయికుమార్, అతని అన్న బాబు అంగీకరించారు. కాగా, పెద్ద మనుషుల మాటలతో మనస్తాపానికి గురైన సాయి తల్లి అక్కమ్మ సోమవారం అర్ధరాత్రి ఇంట్లో పురుగు మందు తాగింది. దాంతో వేదనకు గురైన సాయి సైతం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబసభ్యులు ఇద్దరిని ఆస్పత్రికి తరలించగా సాయికుమార్ చికిత్స పొందుతూ మృతి చెందగా, తల్లి ప్రాణా పాయం నుంచి బయటపడింది. ఈ ఘటనతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో.. సాయికుమార్ దహన సంస్కారాలు పూర్తయ్యే వరకు పోలీసులు పెద్దపహాడ్ గ్రామంలోనే ఉన్నారు. -
తల్లీకొడుకును బలిగొన్న ప్రేమ
సాక్షి, మెదక్: ఓ యువకుడి ప్రేమ వ్యవహారం ఇద్దరిని బలిగొంది. ప్రేమ వ్యవహారంలో మనస్తాపం చెంది యువకుడు మూడు రోజల క్రితం ఆత్మహత్య చేసుకున్నాడు. కన్న కొడుకు ఆత్మహత్య చేసుకోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన తల్లి శుక్రవారం తెల్లవారు జామున చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు, మృతుల కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రామాయంపేటకు చెందిన కటిక శివకుమార్ (21) నార్సింగికి చెందిన బాలికను ప్రేమించి రెండు నెలలక్రితం పెళ్లి చేసుకున్నాడు. ఈనెల 14వ తేదీన ఆ అమ్మాయి మేజర్‌కాగా, తన ఇంటికి రావాలని శివకుమార్ పలుమార్లు ఫోన్‌చేసినా ఆమె స్పందించలేదు. దీనితో మనస్తాపానికి గురైన శివకుమార్ మూడు రోజలక్రితం పట్టణ శివారులో చెట్టుకు ఉరివేసుకున్నాడు. ఒక్కగానొక్క కుమారుడి మృతితో తల్లడిల్లిన తల్లి వరలక్ష్మి (42) మూడు రోజులుగా నిద్రాహారాలు మాని విలపించసాగింది. అందరూ నిద్రించిన తరువాత శుక్రవారం తెల్లవారుజామున పాండ చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఉదయం వరలక్ష్మి కనిపించకపోవడంతో కుటుంబసభ్యులు ఆమె కోసం గాలింపు చేపట్టారు. చెరువు కట్టవద్ద చెప్పులు కనిపించడంతో గజ ఈతగాళ్ల సహాయంతో చెరువులో గాలించగా ఆమె మృతదేహం లభ్యమైంది. భార్య, కుమారుడి మరణంతో భర్త లక్ష్మణ్ మాత్రమే మిగిలాడు. ఎస్ఐ రాజేశ్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రేమించిన అమ్మాయి దక్కదేమోనని.. వాట్సాప్ స్టేటస్ పెట్టి
సాక్షి, నిజామాబాద్: ప్రేమించిన అమ్మాయి దక్కుతుందో లేదోనని మనస్తాపంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలు.. సదాశివనగర్ మండలంలోని లింగంపల్లికి చెందిన ఎల్లారెడ్డి రాము(27) ఆదివారం సాయంత్రం ఉరి వేసుకున్నాడు. రాము కొద్ది రోజులుగా ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. ఆమె దక్కదేమోనని ఇఆదివారం తన వాట్సాప్ స్టేటస్ పెట్టుకున్నాడు. అనంతరం ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయమై ఎస్సైని సంప్రదించగా రాముకు మతిస్థిమితం సరిగా లేదని కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారని చెప్పారు. చదవడి: ఆర్థిక ఇబ్బందులుతో ఒకరు.. వరకట్న వేధింపులు తాళలేక మరొకరు.. ► ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
ఏడో తరగతి నుంచి ప్రేమ.. కాదనడంతో టెన్త్ విద్యార్థి..
సాక్షి, నిజామబాద్: జక్రాన్‌పల్లి మండలంలోని తొర్లికొండలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థి పాఠశాల భవనంపై నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఇందుకు ప్రేమ వ్యవహారమే కారణమని తెలుస్తోంది. వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా పెద్దకొడప్గల్ మండ లంలోని ఓ గ్రామానికి చెందిన విద్యార్థి తొర్లికొండలోని సాంఘిక సంక్షేమ శాఖ ఎస్సీ బాలుర వసతి గృహంలో ఉంటూ జెడ్పీ ఉన్నత పాఠశాలలో టెన్త్ చదువుతున్నాడు. అయితే మంగళవారం ఉదయం హాస్టల్ నుంచి పాఠశాలకు రాలేదని ఉపాధ్యాయులు తెలిపారు. పాఠశాలలో రెండో పీరియడ్ జరుగుతున్న సమయంలో సదరు విద్యార్థి వచ్చినట్లు తెలిపారు. తరగతులు జరుగుతున్న సమయంలో బిల్డింగ్‌పైకి ఎక్కి అక్కడి నుంచి దూకాడని తెలిపారు. గట్టిగా శబ్ధం రావడంతో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఒక్కసారిగా బయటకు వచ్చి చూశారు. విద్యార్థికి తీవ్రగాయాలవడంతో 108 అంబులెన్స్‌లో ఆర్మూర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అయితే కిరణ్ ఓ బాలికను ఏడో తరగతి నుంచే ఇష్టపడుతున్నట్టుగా తెలుస్తోంది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థిని వివరాలు అడగగా తాను ఒక అమ్మాయిని ప్రేమించానని తెలిపాడు. పాఠశాల ఆవరణలో కింద ఓ అమ్మాయితో కాసేపు మాట్లాడానని పేర్కొన్నాడు. అదే సమయంలో బిల్డింగ్‌పైకి ఎక్కి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డానని చెప్పాడు. ఇద్దరి మధ్య ప్రేమ విఫలం కావడంతో విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఆస్పత్రికి ఎంఈవో శ్రీనివాస్, పీఆర్టీయూ మండలాధ్యక్షుడు ప్రవీణ్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి గోపి వచ్చి సదరు విద్యార్థితో మాట్లాడారు. -
ఆరు నెలలుగా ప్రేమ.. శారీరకంగా లొంగదీసుకొని.. పెళ్లి ప్రస్తావన తేవడంతో..
సాక్షి, పహాడీషరీఫ్(హైదరాబాద్): పెళ్లి చేసుకుంటానంటూ నమ్మించి యువతిని లోబర్చుకున్న యువకుడిని బాలాపూర్ పోలీసులు అరెస్ట్ చేసి బుధవారం రిమాండ్‌కు తరలించారు. ఇన్స్పెక్టర్ బి.భాస్కర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఎర్రకుంట సాదత్‌నగర్‌కు చెందిన 20 ఏళ్ల యువతి, అదే ప్రాంతానికి చెందిన షేక్ అబ్దుల్లా బావజీర్(22) ఆరు నెలలుగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో పెళ్లి చేసుకుంటానంటూ శారీరకంగా లొంగదీసుకున్నాడు. చదవండి: ఫోన్ మాట్లాడొద్దన్నా వినలేదు.. షాపుకు వెళ్లొస్తానని చెప్పి.. యువతి పెళ్లి ప్రస్తావన తీసుకురావడంతో ముఖం చాటేశాడు. దీంతో మోసపోయానని గ్రహించిన యువతి బాలాపూర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు యువకుడుని అరెస్ట్ చేసి బుధవారం రిమాండ్‌కు తరలించారు. చదవండి: యువతి కిడ్నాప్ కేసులో ట్విస్ట్.. లాంగ్ డ్రైవ్‌కు వెళ్దామని చెప్పి.. -
నాడు ప్రేమించిన యువతిపై దాడి.. నేడు తట్టుకోలేక యువకుడి ఆత్మహత్య
సాక్షి, జీడిమెట్ల: మనస్తాపంతో ఓ యువకుడు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. జీడిమెట్ల సీఐ కె.బాలరాజు, యువకుడి కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. ఐడీఏ జీడిమెట్లలోని జనప్రియ అపార్ట్‌మెంట్‌కు చెందిన బయోరా శ్యామ్సింగ్, సరస్వతి దంపతుల కుమారుడు ప్రేమ్ సింగ్(22) జేఎన్టీయూ దగ్గరలో ఉన్న ఎంఎన్ఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో నాలుగో సంవత్సరం చదువుతున్నాడు. కాగా ప్రేమ్‌సింగ్ సోదరిని ధన్వాడకు ఇచ్చి వివాహం చేశారు. గత కొన్ని రోజుల క్రితం సోదరి ఇంటిలో విందుకు వెళ్లిన ప్రేమ్‌సింగ్ సోదరి ఇంటి పక్కన ఉండే యువతిని చూసి ప్రేమలో పడ్డాడు. చదవండి: Gachibowli: ప్రేమోన్మాది ఘాతుకం: యువతి గొంతు కోసిన యువకుడు యువతిపై దాడి చేసిన ప్రేమ్‌సింగ్ సదరు యువతి ఫోన్ నెంబర్ తీసుకుని ప్రపోజ్ చేయగా ఆమె తిరస్కరించింది. దీంతో సైకోలా మారిన ప్రేమ్‌సింగ్ సదరు యువతి ఇంటికి వెళ్లి ఆమెపై కత్తితో దాడికి పాల్పడగా ఆమె కుంటుంబ సభ్యులు యువకుడిని పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు ప్రేమ్‌సింగ్‌పై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదైంది. అప్పటి నుంచి ప్రేమ్ సింగ్ ఎక్కువ సేపు తన బెడ్రూంలోనే గడుపుతున్నాడు. చదవండి: వివాహేతర సంబంధం అంటూ కోడలిపై అసత్య ప్రచారం.. ఆమె ఏం చేసిందంటే ఈ నెల 27వ తేదీ శనివారం తన బెడ్రూంలోకి వెళ్లి గడియ పెట్టుకున్నాడు. కుమారుడు రెండు రోజులైనా బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన ప్రేమ్‌సింగ్ తల్లి 29వ తేదీన తలుపు తట్టింది. ఎంతకూ తీయకపోవడంతో అనుమానం వచ్చి జీడిమెట్ల పోలీసులకు సమాచారం అందించగా అక్కడకు చేరుకున్న పోలీసులు తలుపులు విరగొట్టి చూడగా ప్రేమ్‌సింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని మృతి చెంది ఉన్నాడు. మృతుడి తల్లి సరస్వతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని యువకుడి మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. -
జీడిమెట్ల: ప్రేమించిన అమ్మాయి నిరాకరించిందని..
సాక్షి, జీడిమెట్ల: అమ్మాయి తన ప్రేమను నిరాకరించిందని ఓ యువకుడు ఉరి వేసుకుని అత్మహత్య చేసుకున్న సంఘటన జీడిమెట్ల పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. చింతల్ ద్వారకానగర్‌కు చెందిన యాదగిరి కుమారుడు మహేష్ (21) ఏసీ మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. కొన్ని నెలలుగా అదే ప్రాంతానికి చెందిన ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. ఈ విషయాన్ని మహేష్ సదరు యువతికి తెలుపగా నిరాకరించింది. దీంతో మదనపడిన మహేష్ గురువారం ఇంట్లో ఎవరూలేని సమయంలో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకుని అత్మహత్య చేసుకున్నాడు. మృతుని తల్లి మధ్యాహ్నం ఇంటికి వచ్చి చూసే సరికి మహేష్ మరణించి ఉన్నాడు. మృతుని తండ్రి యాదగిరి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావుపై కేసు నమోదు భర్తకు వీడియో కాల్ చేసి భార్య ఆత్మహత్య -
ఇలాంటి ప్రేమికులు కూడా ఉంటారా..!
భోపాల్ : ప్రస్తుత రోజుల్లో ప్రేమ పేరుతో అమ్మాయిలను మోసం చేసే యువకులే ఎక్కువగా ఉన్నారు. ప్రేమించలేదంటూ యాసిడ్ దాడులు, ప్రాణాలు తీస్తున్న జనరేషన్ ఇది. కానీ ఇప్పటికీ నిజాయితీగా ప్రేమించేవారు ఉన్నారని నిరూపించాడు ఓ యువకుడు. తన స్వచ్ఛమైన ప్రేమను నిరూపించుకోవడానికి ప్రాణాలే త్యాగం చేశాడు. నిన్ను నీవు చంపుకొని నీ ప్రేమను నిరూపించుకో అని ప్రియురాలి తండ్రి అనడంతో తుపాకితో తన తలను కాల్చుకొని చనిపోయాడు భోపాల్ యువకుడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భోపాల్‌లోని అరోరా మండలానికి చెందిన అతుల్ లఖండే భారతీయ జనతా యువ మోర్చా(బీజేవైఎం) మండల ఉపాధ్యాక్షుడిగా పనిచేస్తున్నాడు. కాగా గత కొంత కాలంగా అదే మండలానికి చెందిన బ్యాంక్ ఉద్యోగినితో ప్రేమలో ఉన్నాడు. వీరి పెళ్లికి అమ్మాయి తండ్రి నిరాకరించాడు. దీంతో అతుల్‌కి, ఆమె తండ్రికి మధ్య గొడవలు అయ్యాయి. ఒకానొక దశలో అతుల్ బెదిరింపులకు కూడా దిగాడు. దీంతో అమ్మాయిని తీసుకొని ఎంపీనగర్‌కు షిప్ట్ అయ్యారు. కొద్ది రోజుల తర్వాత అతుల్ మళ్లీ ప్రియురాలి ఇంటికి వెళ్లాడు. అక్కడే ఉన్న ఆమె తండ్రి నీది ప్రేమ కాదని, అది మోజు అని ఆరోపించారు.‘ నీ ప్రేమ నిజమైతే నిన్ను నీవు కాల్చుకొని నిరూపించుకో. అప్పుడు బతికి ఉంటే నా కూతురిని ఇచ్చి పెళ్లి చేస్తా. చనిపోతే వచ్చే జన్మలో నా కూతురిని పెళ్లి చేస్కొ’ అని యువతి తండ్రి అతుల్‌కి సవాల్ చేశాడు. దీంతో మంగళవారం రాత్రి 9.30గంటలకు ప్రియురాలి ఇంటికి వెళ్లిన అతుల్ అందరూ చూస్తుండగానే తుపాకితో తలను కాల్చుకున్నాడు. అక్కడే ఉన్న అతుల్ బంధువు, అతని ప్రియురాలు కలిసి ఆసుపత్రికి తరలించగా అప్పటికే అతను మృతి చెందినట్లు డాకర్లు తెలిపారు. కాగా చనిపోవడానికి ఒక రోజు ముందు అతుల్ ఫేస్బుక్లో తన బాధను పంచుకున్నాడు. ‘ నా ప్రేయసి తండ్రి నా ప్రేమను నిరూపించుకునేందుకు ఒక టాస్క్ ఇచ్చాడు. నన్ను నేను కాల్చుకొని నా ప్రేమను నిరూపించుకుంటాను. ఆమె లేని జీవితం నాకు వద్దు. ఇది పూర్తిగా నా వ్యక్తిగత నిర్ణయం. దయచేసి ఆమెను ఎవరూ నిందించకండి. మళ్లి జన్మంటూ ఉంటే తనను పెళ్లి చేసుకోవాలని ఉంది’ అంటూ ప్రియురాలితో కలిసి దిగిన 40 ఫోటోలను పోస్ట్ చేశాడు. అతుల్ గత 13 సంవత్సరాలుగా ఆ యువతిని ప్రేమిస్తున్నాడని, వారి పెళ్లికి యువతి తండ్రి నిరాకరించాడని అతని స్నేహితులు పేర్కొన్నారు. యువతితో ఫోన్ కూడా మాట్లాడనీయకుండా చేశాడని ఆరోపించారు. కాగా ఇప్పటి వరకూ పోలీసులు ఎవరిపైనా కేసు నమోదు చేయకపోవడం గమనార్హం. -
విద్యార్థిని బలిగొన్న ప్రేమ వ్యవహారం
రామాయంపేట, నిజాంపేట(మెదక్): తెలిసీ తెలియని వయస్సులో ప్రేమ వ్యవహారం ఒక విద్యార్థి ప్రాణాలను బలిగొంది. పోలీసులు, కుటుంబీకుల కథనం మేరకు వివరాలిలా ఉన్నా యి. నిజాంపేట మండలం నార్లాపూర్‌కు చెందిన కైరంకొండ అనసూయకు ఇద్దరు కుమారులు ప్రశాంత్(18), నాగరాజు ఉన్నారు. ఆమె భర్త గతంలో చనిపోవడంతో కూలీ పనులు చేసుకుంటూ తన పిల్లలను పోషిస్తోంది. వారికి స్వంత ఇల్లుతోపాటు వ్యవసాయ భూమి లేదు. దీంతో ప్రభుత్వ స్థలంలో గుడిసె వేసుకొని జీవనం కొనసాగిస్తున్నారు. ఇదిలా ఉంటే రామాయంపేటలోని ప్రభుత్వ కళాశాలలో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్న ప్రశాంత్ కొంత కాలంగా అదే గ్రామానికి చెందిన ఒక విద్యార్థినిని ప్రేమిస్తున్నాడు. నిన్ను ప్రేమిస్తున్నానంటూ ఇటీవల ప్రశాంత్ సదరు బాలికకు మేస్సేజ్ పంపాడు. దీంతో బాలిక ఆ విషయాన్ని తన తల్లికి చెప్పంది. బాలిక తల్లి ప్రశాంత్ తల్లి దృష్టికి తీసుకెళ్లింది. విషయం తెలుసుకున్న ప్రశాంత్ శనివారం తన ఇంటినుంచి వెళ్లి బంధువుల ఇంటికి చేరుకున్నాడు. సోమవారం తిరిగి స్వగ్రామానికి వచ్చిన ప్రశాంత్ రాత్రి గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఆవరణలో చున్నీతో చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉదయం మృతదేహాన్ని ఆటో డ్రైవర్లు చూసి విషయాన్ని మృతుడి తల్లికి తెలిపారు. మృతుడి కుటుంబీకులు, బంధువుల రోదనలతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కాగా ప్రశాంత్ ఉరి వేసుకున్న చున్నీ ఎవరిదో అంతుబట్టడం లేదు. అతడి తండ్రి సైతం 11ఏళ్ల క్రితం ఉరివేసుకుని మృతి చెందడం యాథృచ్ఛికం. నిజాంపేట పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
పోలీసు స్టేషన్ ఎదుట మహిళ ఆందోళన
ప్రేమవంచకుని అరెస్టు చేయాలని డిమాండ్ సీఐ హామీతో విరమణ కిర్లంపూడి: ప్రేమ వివాహం చేసుకుని మోసం చేసిన వ్యక్తిని అరెస్టు చేయాలని కోరుతూ గ్రామానికిS చెందిన దళిత మహిళ గుడిమెట్ల పుష్ప శుక్రవారం పోలీసు స్టేషన్ ఎదుట కిరోసిన్ డబ్బాతో బైఠాయించి ఆందోళన చేపట్టింది. పోలీసులు న్యాయం చేయకపోతే ఆత్మహత్యే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేసింది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం పుష్ప కువైట్‌లో పని చేస్తుండగా అక్కడే తన పక్కింట్లో డ్రైవర్‌గా పని చేస్తున్న పశ్చిమగోదావరి జిల్లా అత్తిలి మండలం కొమ్మర గ్రామానికి చెందిన గుడిమెట్ల రామకృష్ణాధనారెడ్డితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారింది. అన్నవరం సత్యన్నారాయణస్వామి దేవస్థానంలో తాము వివాహం చేసుకున్నామని, ఆతర్వాత కొంత కాలం కాపురం చేసిన రామకృష్ణధనారెడ్డి అతని ఇంటికి తీసుకువెళ్లాడని తెలిపింది. అక్కడ అత్తమామల నుంచి పుష్పకు వేధింపులు ఎదురయ్యాయి. అంతే కాకుండా ఆమె సంపాదించిన ఆస్తిమొత్తం కాజేసి భర్త కూడా కాపురం చేయనని చెప్పి ఇంట్లోంచి గెంటివేశారు. దాంతో గతేడాది జూన్‌లో పుష్ప కిర్లంపూడి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దానిపై ఆమె భర్త, అత్తమామలు, మరో ఇద్దరిపై అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఇది జరిగి ఏడాది అయినప్పటికీ పోలీసులు వారిపై చర్యలు తీసుకోలేదని ఆమె ఈ ఆందోళనకు దిగింది. న్యాయం చేసే వరకు దీక్ష విరమించబోనని ఆమె భీష్మించింది. విషయం తెలుసుకున్న జగ్గంపేట సీఐ పి.కాశీవిశ్వనాథం బాధితురాలితో మాట్లాడి వారం రోజుల్లో న్యాయం చేస్తానని హామీ ఇవ్వడంతో ఆమె ఆందోళన విరమించింది. ఈ ఆందోళనలో స్థానిక దళిత నాయకులు బాతు అప్పారావు, మారెళ్లి కృపానందం, గుద్ధాటి అప్పారావు, కట్టు నాగేశ్వరరావు, మూరా రాజ్‌కుమార్, గుద్ధాటి శ్రీను, అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. -
తార్కిక ఆలోచన ముఖ్యం
సమస్య చిన్నదైనా... పెద్దదైనా... పరిష్కరించుకోవడానికి వ్యక్తిత్వమూ, తార్కిక ఆలోచనా ముఖ్యం. వ్యక్తిత్వం పెంచుకునే కొద్దీ బాధల నుంచి బయటపడొచ్చు జీవన గమనం ఈ శీర్షికలో ప్రశ్నలు చూస్తూ ఉంటే... ఇంత చిన్నచిన్న సమస్యల కోసం మనుషులు ఇంత వేదన అనుభవిస్తున్నారా అనిపిస్తుంది. ప్రపంచంలో ఎంతోమంది ఇంతకన్నా పెద్ద సమస్యలతో బాధపడుతున్నారు. వాటికి పరిష్కారాలు చెబితే బాగుంటుందని నా ఉద్దేశం. - సోమశేఖర్, విశాఖపట్నం ఎవరి సమస్య వారికి పెద్దగానే తోస్తుంది. పద్నాలుగేళ్ల అమ్మాయి ప్రేమ సమస్య మనకు నవ్వు తెప్పించవచ్చు. అరవయ్యేళ్ల వృద్ధురాలికి మనవడితో ఆర్థిక సమస్య మనకి అసలు సమస్యే కాదనిపించవచ్చు. నల్లగా ఉన్నాను కాబట్టి పెళ్లి కావటం లేదన్న యువతి సమస్య మనకు చిన్నదిగా కనిపించవచ్చు. ‘‘సమస్య చిన్నదైనా.. పెద్దదైనా.. పరిష్కరించుకోవడానికి వ్యక్తిత్వమూ, తార్కిక ఆలోచనా ముఖ్యం. వ్యక్తిత్వం పెంచుకునే కొద్దీ ఇలాంటి బాధల నుంచి బయటపడొచ్చు’’ అని మోటివేట్ చెయ్యడమే ఈ శీర్షిక ఉద్దేశం. అయిదు నిమిషాల్లో చర్మ సౌందర్యాన్ని మార్చే క్రీముల బారి నుంచి, తాయెత్తు కట్టి కష్టాల నుంచి బయటకు తప్పిస్తాము... మంత్రం చదివి డబ్బు రెట్టింపు చేస్తాము అనే బాబాల బారి నుంచి రక్షించేదే వ్యక్తిత్వం. నేను ఎమ్.బి.ఏ చేశాను. పెద్ద కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాను. నలభై వేలకు పైనే వస్తోంది. ఉద్యోగంలో చేరిన వెంటనే నా ఇంటర్ క్లాస్మేట్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. ఆయన ఓ చిన్న కంపెనీలో అకౌంటెంట్‌గా పని చేస్తున్నారు. జీతం నాకంటే చాలా తక్కువ. దానికి నేనేం బాధపడటం లేదు. మొదట్లో చాలా సంతోషంగా ఉండేవాళ్లం. కానీ ఈ మధ్య తను లోలోపల కుమిలిపోతున్నాడని అనిపిస్తోంది. తనకంటే నాది మంచి ఉద్యోగం అని, ఎక్కువ జీతం అని చాలాసార్లు అనేస్తుంటాడు. అది మామూలుగా అనడం లేదేమో అని నాకు అనిపిస్తోంది. ఇది మా ఇద్దరి మధ్య గ్యాప్‌ను పెంచుతుందేమో అని కూడా భయంగా ఉంది. తన మనసులో నుంచి ఆ ఫీలింగ్‌ను ఎలా తీసేయాలి? - ఉష, రాజమండ్రి మీ భర్త మనస్తత్వం ఎటువంటిది? సున్నిత మనస్కుడా? లేక ప్రాక్టికల్‌గా ఆలోచించేవాడా? అతడు ఎలాంటి వాడైనా, ముందు అతని ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్‌ను పోగొట్టాలి. అంతకన్నా ముఖ్యంగా ముందు మీరు మీ బాధనీ, భయాన్నీ తనకి స్పష్టంగా అర్థమయ్యేటట్టు చెప్పాలి. అతడు ప్రాక్టికల్ అయితే, ‘‘నాకన్నా నీకు జీతం తక్కువని నువ్వు బాధపడుతున్నావ్! నేనేం చేయాలో నువ్వే చెప్పు. ఉద్యోగం మానేయనా?’’ అనండి. కంగారుపడి వద్దు వద్దంటాడు. అతడు బాగా సున్నిత మనస్కుడైతే, ఒక పది రోజుల పాటు ఇద్దరూ ఎక్కడికైనా వెళ్లండి. హాయిగా గడపండి. మెల్లిగా మీ భావాలను తనతో పంచుకోండి. ‘తన కన్నా మీ జీతం ఎక్కువన్న కారణం వల్ల మీరు కూడా బాధపడుతున్నారు’ అన్న సంగతిని అతనికి తెలిసేలా చేయండి. పనిలో పనిగా... (ప్రేమ వివాహం అంటున్నారు కాబట్టి) డబ్బు లేకపోవటం వల్ల వచ్చే కష్టనష్టాల గురించి కూడా అతనితో డిస్కస్ చేయండి. అతడు మీ బాధను, మీలో జరిగే సంఘర్షణను తప్పకుండా అర్థం చేసుకుంటాడు. మిమ్మల్ని ప్రేమించే వ్యక్తి కాబట్టి, మీ బాధను తప్పకుండా తీర్చడానికి ప్రయత్నిస్తాడు. ఖాళీగా ఉండి అనవసరపు ఆలోచనలతో సతమతమవ్వకుండా, తీరిక వేళల్లో ఏదైనా హాబీ పెంపొందించుకునేలా ప్రోత్సహించండి. చిత్రలేఖనం నుంచి పత్రికలకు వ్యాసాలు రాయటం వరకు ఏదైనా కావొచ్చు. ఏ మంచి హాబీ లేనివాళ్లకు నిరాశాపూరితమైన ఆలోచనలు ఎక్కువ వస్తాయి. ఏమో ఎవరు చెప్పొచ్చారు... అతడి హాబీనే అతన్ని ఆర్థికంగా ఉన్నత శిఖరాల మీద నిలబెట్టవచ్చేమో!