చిన్నారి కిడ్నాప్‌కు విఫలయత్నం | Man tries to kidnap girl | Sakshi
Sakshi News home page

చిన్నారి కిడ్నాప్‌కు విఫలయత్నం

Published Thu, Jan 28 2016 3:22 PM | Last Updated on Sun, Sep 3 2017 4:29 PM

Man tries to kidnap girl

హైదరాబాద్ : పాఠశాల ఎదురుగా ఆడుకుంటున్న చిన్నారిని కిడ్నాప్ చేయడానికి యత్నించిన యువకుడిని గుర్తించిన స్థానికులు అతనికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటన నగరంలోని జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం చోటుచేసుకుంది. స్థానిక పాఠశాల ముందు ఆడుకుంటున్న చిన్నారిని ఓ యువకుడు ఎత్తుకెళ్లడానికి ప్రయత్నించాడు. దీంతో బాలిక కేకలు వేసింది. బాలిక కేకలు విన్న స్థానికులు యువకుడిని పట్టుకొని దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement