జీడిమెట్ల (హైదరాబాద్) : ఒకరు కంపెనీలో పనిచేస్తున్న వ్యక్తి, మరొకరు అదే కంపెనీలో పని చేసి మానేసిన వ్యక్తి. ఇద్దరూ కలసి ఓ రాత్రి వేళ కంపెనీలోకి చొరబడి రూ.7 లక్షల విలువైన వస్తువులను చోరీ చేశారు. ఈ ఘటనలో ఇద్దరు నిందితులను జీడిమెట్ల పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు.
వివరాల్లోకి వెళ్తే.. జీడిమెట్ల పారిశ్రామిక వాడలోని ఫేజ్-3లో ఉన్న ఆక్వాగార్డు కంపెనీలో కొన్ని రోజుల క్రితం చోరీ జరిగింది. కంపెనీ యాజమాన్యం ఫిర్యాదు మేరకు విచారణ జరిపిన పోలీసులు కంపెనీలో పనిచేస్తున్న కార్మికుడు రాజ్‌కుమార్ ప్రసాద్ సింగ్ (19)తో పాటు ఆ కంపెనీ మాజీ కార్మికుడు రాజేష్ (23)లను మంగళవారం అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.7 లక్షల విలువైన డ్రిప్ ఇరిగేషన్ పరికాలను స్వాధీనం చేసుకుని వారిని రిమాండ్‌కు పంపారు.
పనిచేస్తున్న కంపెనీకే కన్నం
Published Tue, Jun 16 2015 3:48 PM | Last Updated on Thu, Aug 30 2018 5:27 PM
Advertisement
Advertisement