
సాక్షి, హైదరాబాద్ ( జీడిమెట్ల): కన్న తల్లికి పేగు బంధం బరువైందో.. లేక ఆడపిల్ల పుట్టిందని వద్దనుకుందో.. ఏమోకాని మూడు నెలల చిన్నారిని ఆగిఉన్న ఆటోలో వదిలి వెళ్లిన సంఘటన జీడిమెట్ల పోలీస్‌స్టేషన్‌లో చోటు చేసుకుంది. సీఐ బాలరాజు వివరాల ప్రకారం.. షాపూర్‌నగర్‌లోని న్యూఎల్‌బీనగర్‌కు చెందిన ఓ వ్యక్తి శుక్రవారం డయల్ 100కు ఫోన్ చేసి ఆటోలో చిన్నారి ఎడుస్తోందని పోలీసులకు సమాచారం అందించారు.
అక్కడకు చేరుకున్న పోలీసులు, షీటీం బృందం ఆటోలో ఉన్న పాపను స్టేషన్‌కు తీసుకువచ్చి తల్లిదండ్రుల కోసం ఆరా తీయగా ఫలితం లేకపోయింది. ఎవరూ పాప అదృశ్యమైనట్లు ఫిర్యాదు చేయలేదు. పోలీసులు చిన్నారిని అమీర్‌పేట్‌లోని శిశువిహార్‌కు తరలించారు.
( చదవండి: ఎనిమిది నెలల గర్భిణిని కాల్చి చంపిన భర్త )
Comments
Please login to add a commentAdd a comment