
సాక్షి, హైదరాబాద్: గచ్చిబౌలిలో దారుణం చోటుచేసుకుంది. ఓ ప్రైవేట్ ఉద్యోగినిపై ఇద్దరు యువకులు లైంగికదాడికి పాల్పడ్డారు. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని మసీద్ బండ ప్రాంతంలో ఆటోలో యువతిపై అత్యాచారం చేశారు. ఆ యువతి పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. యువకుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఆర్సీపురం నుంచి గచ్చిబౌలికి ఆటోలో యువతి వెళ్తుండగా ఆ ఘటన జరిగింది.
కోడలిపై అత్త, ఆడపడుచు దాడి
కోడలిపై అత్త, ఆడపడుచు వేడి నీళ్లు పోవడంతో తీవ్రంగా గాయపడిన సంఘటన పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. నిజామాబాద్ జిల్లాకు చెందిన నజియా బేగంకు సంతోష్‌నగర్ ఓవైసీ కాలనీకి చెందిన షేక్ షబ్బీర్‌తో వివాహం జరిగింది. షేక్ షబ్బీర్ ప్రస్తుతం ఉద్యోగం నిమిత్తం దుబాయ్‌లో ఉంటున్నాడు. నజియా బేగంకు నలుగురు సంతానం.
అత్త మహ్మదియా బేగంతో తరుచూ గొడవలు జరుగుతుండటంతో నజియాబేగం కొద్ది రోజుల క్రితం అదే ప్రాంతంలో పిల్లలతో కలిసి వేరుగా నివాసముంటోంది. ఆదివారం పిల్లలు నానమ్మ ఇంటికి వెళ్లడంతో వారిని తీసుకొచ్చేందుకు నజియా బేగం అత్తగారింటికి వెళ్లింది. ఈ సందర్భంగా అత్త, ఆడపడుచుల మధ్య వాగ్వాదం జరగడంతో ఆగ్రహానికి లోనైన అత్త మహ్మదియా బేగం, ఆమె కుమార్తె కలిసి నజియా బేగంపై వేడి నీళ్లు పోయడంతో తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం బాధితురాలు నజియా బేగం ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Comments
Please login to add a commentAdd a comment