
నియామే: ఆఫ్రికా దేశం నైగర్ రాజధాని నియామేలో బోల్తా పడిన పెట్రోల్ ట్యాంకర్ నుంచి స్థానికులు పెట్రోల్ సేకరిస్తుండగా అది పేలి 58 మంది మరణించారు. అక్కడి అంతర్జాతీయ విమానాశ్రయానికి దగ్గర్లోని రైలు పట్టాలపై ఆదివారం రాత్రి ట్యాంకర్ బోల్తా పడి పెట్రోల్ కారుతుండగా, ఆ పెట్రోల్‌ను తెచ్చుకోడానికి పెద్ద సంఖ్యలో ప్రజలు అక్కడకు చేరుకున్నారు. అనంతరం ట్రక్కు పేలడంతో అక్కడ ఉన్నవాళ్లలో చాలా మంది మరణించారు. చుట్టుపక్కల ఇళ్లు కూడా ఈ మంటల కారణంగా ధ్వంసమయ్యాయి. 58 మంది మరణించినట్లు అధికారులు ధ్రువీకరించారు.
Comments
Please login to add a commentAdd a comment