
ఆయిల్ ట్యాంకర్ పేలి 123 మంది మృతి
బహవల్‌పూర్: పాకిస్తాన్‌లో ఘోర ప్రమాదం జరిగింది. పంజాబ్ రాష్ట్రం బహవాల్‌పూర్‌లోని అహ్మద్‌పూర్‌లో ఆయిల్ ట్యాంకర్ పేలడంతో 123 మంది ప్రాణాలు కోల్పోయారు.
రోడ్డు ప్రమాదంలో ఆయిల్ ట్యాంకర్ నుంచి ఆయిల్ లీక్ అవుతుండటంతో దానిని తీసుకోవడానికి ఎగబడ్డవారితో పాటు.. అటుగా వెళ్తున్న పలువురు వాహనదారులు ఈ ప్రమాదంలో మృతిచెందినట్లు తెలుస్తోంది. మరో 40 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారని అధికారులు వెల్లడించారు. ఆయిల్ ట్యాంకర్ సమీపంలో సిగరెట్ తాగడం మూలంగా ఈ ప్రమాదం జరిగినట్లు అనుమానిస్తున్నారు.
గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. వారిలో చాలామందికి 70 శాంతం కన్నా ఎక్కువ కాలిన గాయాలయ్యాయని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని వెల్లడించారు. మృతులను గుర్తుపట్టాలంటే డీఎన్‌ఏ టెస్ట్‌లు చేయాలని.. వారి శరీరాలు పూర్తిగా తగులబడ్డాయని సహాయక చర్యలు నిర్వహిస్తున్న అధికారులు వెల్లడించారు.