న్యూఢిల్లీ: శ్రీలంక తీరంలో ఎమ్‌టీ న్యూ డైమండ్ అనే నౌక ప్రమాదానికై గురైంది. కువైట్ నుంచి భారత తూర్పు తీరంలోని ఒడిశా పారాదీప్ తీరానికి ఆయిల్ ట్యాంకర్‌తో బయల్దేరిన పనామా పడవలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఒకరు తీవ్రంగా గాయపడగా.. మరొకరు గల్లంతైనట్లు సమాచారం. ప్రమాద సమయంలో నౌకలో మొత్తం 23 మంది ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో రక్షణ చర్యల్లో సాయం అందించాల్సిందిగా కోరిన శ్రీలంక నావికా దళ అభ్యర్థన మేరకు భారత్‌కు చెందిన మూడు కోస్ట్‌గార్డు షిప్పులు అక్కడికి బయల్దేరాయి. శౌర్య, సారంగ్, సముద్రలను అక్కడికి పంపడంతో పాటుగా తక్షణ సహాయక చర్యల కోసం ఓ విమానాన్ని కూడా తరలించినట్లు ఇండియన్ కోస్ట్‌గార్డ్ ట్విటర్ వేదికగా వెల్లడించింది. కాగా చమురుతో బయల్దేరిన ఈ నౌక శనివారం పారాదీప్ తీరానికి చేరుకోవాల్సి ఉండగా.. ఇంతలో ప్రమాదం చోటుచేసుకుంది.
#SavingLives #SAR #FireFighting assistance sought by Sri Lanka Navy from @IndiaCoastGuard for fire and explosion onboard Oil Tanker #MTNewDiamond 37 NM east off #Srilanka coast. #ICG ships and aircraft deployed for immediate assistance @DefenceMinIndia @MEAIndia pic.twitter.com/OsvgyZfKq0
— Indian Coast Guard (@IndiaCoastGuard) September 3, 2020
Comments
Please login to add a commentAdd a comment