
రోడ్డు ప్రమాదం: 57 మంది దుర్మరణం
కరాచీ: పాకిస్థాన్ లో ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఓ ఆయిల్ ట్యాంకర్ ను బస్సు ఢీకొన్న ఘటనలో కనీసం 57 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. కరాచీ నుంచి షికాపూర్ కు వెళుతున్నఓ బస్సు సూపర్ హైవేపై అతి వేగంగా వస్తున్నఆయిల్ ట్యాంకర్ ను ఢీకొట్టడంతో రెండు వాహనాల్లో మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో బస్సు పూర్తిగా అగ్నికి ఆహుతి కావడంతో భారీ సంఖ్య లో ప్రాణ నష్టం వాటిల్లింది.
బస్సులో ఒక మహిళ, చిన్నారితో సహా 57 మంది వరకూ దుర్మరణం పాలైనట్లు ప్రాథమిక సమాచారం. ట్యాంకర్ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ఘోర ప్రమాదం జరిగిందని కరాచీ కమిషనర్ షోయబ్ సిద్ధిఖి తెలిపారు.