ఎర్రసముద్రంలో మరో రెండు నౌకలపై హౌతీ తిరుగుబాటుదారులు దాడి చేశారు. 25 మంది భారతీయులు ఉన్న ఆయిల్ ట్యాంకర్‌పై డ్రోన్‌దాడి చేశారని భారత నౌకాదళం తెలిపింది. అయితే.. ఇండియన్ జెండా లేని నౌకపైనే దాడి జరిగినట్లు స్పష్టం చేసింది. గాబన్ జెండాతో ప్రయాణిస్తున్న నౌకపై దాడి చేశారని వెల్లడించింది. ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని పేర్కొంది. మరోవైపు నార్వేజియన్ జెండా కలిగిన మరో ఆయిల్ ట్యాంకర్‌పై కూడా హౌతీ తిరుగుబాటుదారులు దాడి చేశారు.
అయితే.. భారత జెండా కలిగిన నౌకపై హౌతీ తిరుగుబాటుదారులు దాడి చేశారని అమెరికా ఇంటెలిజెన్స్ పొరపాటున ఇంతకుముందు తెలిపింది. కానీ అలాంటిదేమీ లేదని తర్వాత భారత నౌకాదళం తెలిపింది. ఆయిల్ ట్యాంకర్ ఎంవీ సాయిబాబాపై దాడి జరిగినట్లు స్పష్టం చేసింది. మరోవైపు నార్వేజియన్ జెండా కలిగిన మరో ఆయిల్ ట్యాంకర్‌పై కూడా హౌతీ తిరుగుబాటుదారులు దాడి చేశారు.
అలాగే, అమెరికా యుద్ధ నౌక యూఎస్‌ఎస్ లబూన్ పై కూడా డ్రోన్ దాడులకు ప్రయత్నాలు జరిగాయి. కానీ ఆ డ్రోన్ల్‌ను యుద్ధనౌక కూల్చివేసిందని అమెరికా సెంట్‌కామ్ వెల్లడించింది. ఈ ఘటనల తర్వాత అక్టోబర్ 17 తర్వాత వాణిజ్య నౌకలపై జరిగిన దాడుల సంఖ్య 15కు చేరినట్లు పేర్కొంది.
ఓవైపు గుజరాత్ సమీపంలో ఇజ్రాయెల్‌కు చెందిన నౌకపై ఇరాన్ దాడి చేసినట్లు అమెరికా పేర్కొంది. ఈ ఘటనతో అంతర్జాతీయంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. యెమెన్‌లో కేంద్రీకృతమైన ఇరాన్ మద్దతుగల హౌతీలు.. గాజాలో ఇజ్రాయెల్ యుద్ధానికి ప్రతిస్పందనగా ఎర్ర సముద్రంలో దాడులకు పాల్పడుతున్నారు. బాబ్ అల్-మందాబ్ జలసంధి గుండా వెళుతున్న నౌకలపై దాడులతో అంతర్జాతీయ వాణిజ్యానికి అంతరాయం కలిగిస్తున్నారు.
ఇదీ చదవండి: డ్రోన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే..
Comments
Please login to add a commentAdd a comment