ఎర్ర సముద్రంలో యెమెన్ హౌతీ తిరుగుబాటుదారుల దాడులకు గురైన ‘సోయూనియన్’ అనే 900 అడుగుల భారీ చమురు ట్యాంకర్ ఇది. ఆగస్ట్ 21వ తేదీన ట్యాంకర్‌కు అంటుకున్న మంటలు ఇప్పటికీ చల్లారలేదు. ఇందులోని 10 లక్షల బ్యారెళ్ల ముడి చమురు లీకైతే మునుపెన్నడూ లేనంతగా సముద్ర పర్యావరణానికి హాని కలుగుతుందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
అందుకే, సాధ్యమైనంత మేర ట్యాంకర్‌లోని చమురును తరలించే అత్యంత క్లిష్టమైన ప్రక్రియను మొదలుపెట్టనున్నారు. గ్రీస్‌కు చెందిన ఈ నౌక యాజమాన్యం ఈ విషయంలో సౌదీ అరేబియా సాయం కోరింది. అప్పటి వరకు మరిన్ని దాడులు జరగకుండా గ్రీస్, ఫ్రాన్సు నౌకలు ‘సోయూనియన్’కు కాపలాగా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment