కొణిజర్ల (ఖమ్మం) : ఆయిల్ ట్యాంకర్ ఆటోను ఢీ కొట్టడంతో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలంలో గురువారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. మండలంలోని తనికెళ్ల గ్రామ సమీపంలో ఆటోను వేగంగా వస్తున్న ఆయిల్ ట్యాంకర్ ఢీకొట్టింది. దీంతో ఆటో డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం బాధితుడు స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాగా ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.