కానిస్టేబుల్ అత్యుత్సాహం...
Published Mon, Oct 24 2016 10:58 AM | Last Updated on Sat, Mar 9 2019 4:28 PM
కారేపల్లి: కల్తీ మద్యం తయారు చేస్తున్న వారిని తీసుకెళ్తున్న ఆటో బోల్తా పడటంతో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. అయితే, ఆ సమయంలో ఆటోను నడుపుతున్నది పోలీస్ కానిస్టేబుల్ కావటం గమనార్హం. వివరాలివీ.. ఖమ్మం జిల్లా కారేపల్లి మండల పోలీసులు సోమవారం ఉదయం రేలకాయలపల్లి జైత్రాం తండా, జీత్యా తండాలపై దాడులు చేపట్టారు. ఈ సందర్భంగా కల్తీ మద్యం తయారు చేస్తున్నారనే ఆరోపణలతో ఆరుగురు మహిళలను అదుపులోకి తీసుకున్నారు.
అయితే, కానిస్టేబుల్ హరి.. డ్రైవర్‌ను కాదని తానే ఆటో నడిపేందుకు పూనుకున్నాడు. చీమలపాడు-మాణిక్యారం గ్రామాల మధ్య ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో కానిస్టేబుల్ హరితోపాటు ఆరుగురు మహిళలు గాయపడ్డారు. క్షతగాత్రుల్లో కేలోత్ రామ్ని పరిస్థితి విషమంగా ఉంది. అందరినీ కారేపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కానిస్టేబుల్ నిర్లక్ష్యమే తమ ప్రాణాల మీదికి తెచ్చిందని బాధితులు ఆరోపిస్తున్నారు.
Advertisement
Advertisement