నేరేడ్‌మెట్ : వేగంగా వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఆటోను ఢీ కొట్టడంతో ఆటో డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. కంటోన్మెంట్ డిపోకు చెందిన బస్సు శుక్రవారం కాకతీయనగర్ నుంచి ఈసీఐఎల్ వెళ్తున్న క్రమంలో వాయుపురి చౌరస్తా సమీపంలో రోహిణి కాలనీ నుంచి వస్తున్న ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. దీంతో ఆటో పల్టీలు కొట్టి పక్క నుంచి వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ కోటేశ్వరరావుకు గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు 108 సాయంతో స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటనతో ఆర్టీసి బస్సు రోడ్డుపై ఆగిపోవడంతో చాలా సేపు ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. బస్సు అక్కడే ఆగిపోవడంతో ఆర్టీసి బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు మరో బస్సును ఆశ్రయించారు.