పశ్చిమ గోదావరి (భీమవరం) : ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు మృతి చెందిన ఘటన ఆదివారం తెల్లవారుజామున పశ్చిమగోదావరి జిల్లా భీమవరం సమీపంలో చోటుచేసుకుంది. విజయవాడ నుంచి భీమవరం వెళ్తున్న ఆర్టీసీ బస్సు సీతలి గ్రామం వద్ద ఆటోను ఢీకొంది.
ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.