neredmet
-
నేరేడ్మెట్లో బాలికపై గ్యాంగ్ రేప్.. 10 మంది అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: నేరేడ్మెట్లో తీవ్ర సంచలనం సృష్టించిన బాలిక గ్యాంగ్ రేప్ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ కేసులో కీలక సూత్రధారులైన నరేష్, విజయ్‌లతో పాటు మరో 8 మందిని పోలీసులు అరెస్టు చేశారు.ఈ నెల 22న కాచిగూడ నుంచి 12 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసిన నిందితులు.. కూల్‌డ్రింక్‌లో గంజాయి కలిపి తాగించారు. బాలిక మత్తులోకి వెళ్లిన తర్వాత నిర్మానుష్యప్రాంతానికి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్టు పోలీసులు తెలిపారు. -
Hyderabad: రోడ్డు ప్రమాదంలో ఒకరు.. కరెంట్ షాక్‌తో మరొకరు!
సాక్షి, హైదరాబాద్: ఇంటి మరమ్మతులు చేస్తుండగా ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తగిలి మహిళ మృతి చెందిన ఘటన నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులవివరాల ప్రకారం.. నేరేడ్మెట్ చంద్రబాబునగర్‌లో నివాసముండే ఏ.మణ్యం ఇంట్లో మరమ్మతులు చేస్తుండగా ప్రమాదవశాత్తు కోడలు వరలక్ష్మీ(21) కరెంట్ షాక్‌కు గురైంది. తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం నేరేడ్మెట్లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. రోడ్డు ప్రమాదంలో విద్యార్థి దుర్మరణం రోడ్డు ప్రమాదంలో విద్యార్థి దుర్మరణం చెందిన ఘటన మల్కాజిగిరి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. ఓల్డ్ మీర్జాలగూడకు చెందిన సాయితేజ యాదవ్(23) ఓయూలో ఎంబీఏ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఈ నెల 1వ తేదీ రాత్రి స్నేహితుడి బైక్(కేటీఎం డ్యూక్) తీసుకొని బంధువుల ఇంట్లో జరుగుతున్న ఫంక్షన్‌కు వెళ్లాడు. తెల్లవారుజామున ఇంటికి తిరిగి వస్తుండగా సాయిరాం థియేటర్ దాటిన తర్వాత బైక్‌కు కుక్క అడ్డురావడంతో అదుపుతప్పి ఫుట్‌పాత్‌ను ఢీకొట్టాడు. తీవ్రగాయాలు కావడంతో స్థానిక ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. సాయితేజ తల్లి ప్రమీల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
Hyderabad: బైక్‌పై చలాన్లు చూసి షాకైన పోలీసులు
సాక్షి, హైదరాబాద్: సాధారణంగా ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తే ఒకటి, రెండు ఫైన్లు ఉంటేనే మనం గాబరపడిపోతుంటాం. ఫైన్ చెల్లించి జాగ్రత్త పడితే మేలని భావిస్తుంటాం. అయితే తాజాగా ఓ వ్యక్తికి వచ్చిన చలాన్లు చూసి ట్రాఫిక్ పోలీసులు సైతం షాక్ అయ్యారు. 79 చలాన్లు పెండింగ్‌లో ఉన్న బైక్‌ను ట్రాఫిక్ పోలీసులు సీజ్ చేశారు. బుధవారం నేరేడ్మెట్ చౌరస్తాలో ట్రాఫిక్ పోలీసులు వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా సందీప్‌కుమార్‌కు చెందిన (ఏపీ 10 ఏడబ్లూ 2064) బైక్‌పై 79 చలాన్లు ఉన్నట్లు గుర్తించారు. దీంతో బైక్‌ను సీజ్ చేసినట్లు మల్కాజిగిరి ట్రాఫీక్ సీఐ సుదీర్ కృష్ణ తెలిపారు. చదవండి: ఇతగాడి పెండింగ్ చలానాలను చూస్తే అవాక్కవ్వాల్సిందే.. -
నేరేడ్మెట్: చదువు కోసం వచ్చి.. వ్యభిచారం
సాక్షి, నేరేడ్మెట్: వీసా గడువు ముగిసినా అక్రమంగా ఇక్కడే ఉంటూ డబ్బుల సంపాదన కోసం ఆన్లైన్ వ్యభిచారం నిర్వహిస్తున్న టాంజానియా దేశానికి చెందిన యువతీ, యువకుడు కటకటాలపాలయ్యారు. మల్కాజిగిరి ఎస్ఓటీ, నేరేడ్మెట్ పోలీసులు సంయుక్తంగా చేసిన డెకాయ్ ఆపరేషన్‌లో ఆన్లైన్ వ్యభిచార కార్యకలాపాల గుట్టు రట్టు అయింది. నేరేడ్మెట్ సీఐ నర్సింహస్వామి తెలిపిన వివరాల ప్రకారం.. టాంజానియా దేశానికి చెందిన యువతి(24), ఆమె స్నేహితుడు కబంగిలా వారెన్(24) ఉన్నత విద్యనభ్యసించేందుకు గత ఏడాది జనవరిలో స్టడీ వీసాపై భారత్‌కు వచ్చారు. ఉస్మానియా యూనివర్సిటీలో డిగ్రీ కోర్సును పూర్తి చేశారు. వీసా గడువు ముగిసినా ఎఫ్ఆర్ఆర్ఓలో రెన్యూవల్ చేసుకోలేదు. కొంత కాలంపాటు తార్నాకలో నివసించిన వీరద్దరు రెండు నెలల క్రితం నేరేడ్మెట్ ఠాణా పరిధిలోని జీకే కాలనీకి మకాం మార్చారు. భార్యాభర్తలుగా చెప్పుకొని ఓ ఇంట్లో అద్దెకు దిగారు. మీట్–24 యాప్‌లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. నిర్వాహకురాలు/బాధితురాలైన యువతి తన అర్ధనగ్న ఫొటోలను అప్లోడ్ చేస్త తద్వారా కస్టమర్లను ఆకర్షించేది. తరువాత యాప్ ద్వారా చాటింగ్ చేసిన కస్టమర్లకు తన వ్యక్తిగత ఫోన్ నంబర్ ఇచ్చి, వారితో శృంగార సంభాషణ చేస్తూ ఇంటికి ఆహ్వానిస్తుంది. తరువాత వ్యభిచార కార్యకలాపాల్లో పాల్గొంటూ డబ్బులు సంపాదిస్తోంది. ఈ కార్యకలాపాలకు ఆమె స్నేహితుడు కబంగిలా వారెన్‌లు సహకరిస్తున్నాడు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు రాచకొండ సీపీ మహేష్‌భగవత్ పర్యవేక్షణలో మల్కాజిగిరి ఎస్ఓటీ, నేరేడ్మెట్ పోలీసులు డెకాయ్ ఆపరేషన్ ఆన్లైన్ వ్యభిచార గుట్టును రట్టు చేశారు. సోమవారం పోలీసులు ఇంటిపై దాడి చేసి ఇద్దరిని అరెస్టు చేసి, ఠాణాకు తరలించారు. రెండు సెల్ఫోన్లు, పాస్‌పోర్టులను పోలీసులు సీజ్ చేశారని సీఐ చెప్పారు. చదవండి: వేశ్యవాటిక గుట్టురట్టు.. ఇద్దరు యువతులు, 3 విటుల అరెస్ట్ -
హైదరాబాద్‌లో హిజ్రాల హల్చల్.. డబ్బులు డిమాండ్.. ఆపై!
సాక్షి, హైదరాబాద్: నేరేడ్మెట్ ప్రాంతంలో కొందరు హిజ్రాలు హల్చల్ చేశారు. స్థానికంగా పెళ్లి జరుగుతున్నఇంట్లోకి ప్రవేశించి ఏకంగా 50 వేల రూపాయలు డిమాండ్ చేశారు. అంత మొత్తంలో డబ్బులు పెళ్లి వారు ఇవ్వకపోవడంతో వారితో అసభ్యంగా ప్రవర్తించారు. డబ్బులు ఇవ్వాల్సిందేనని బట్టలు విప్పి హిజ్రాలు నానా హంగామా చేశారు. అంతటితో ఆగకుండా పెళ్లి వారిపై దాడి చేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో బాధితులు పోలీసులకు సమాచారమివ్వగా.. రంగంలోకి దిగిన పోలీసులు నలుగురు హిజ్రాలను అదుపులోకి తీసుకొని నేరేడ్మెట్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అయితే హిజ్రాలు పోలీస్ స్టేషన్లో సైతం బట్టలు విప్పి ఇబ్బంది కలిగేలా ప్రవర్తించడంతో వారిపై 506, 448 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. స్టేషన్లో హంగామా చేసినందుకు ఐపీసీ 188, 51 (బి) డిజాస్టర్ మేనెజ్మెంట్ కింద మరో కేసు నమోదు చేశారు. -
యశస్వి ఆత్మహత్య.. పాఠశాల సీజ్
నేరేడ్మెట్: పదో తరగతి విద్యార్థిని యశస్విని ఆత్మహత్య ఘటన నేపథ్యంలో అఖిలపక్ష నాయకులతోపాటు విద్యార్థి సంఘాల నేతలు శుక్రవారం నేరేడ్మెట్ ఠాణా పరిధిలోని రవీంద్రభారతి పాఠశాల ఎదుట బైఠాయించి ఆందోళన నిర్వహించారు. పాఠశాల వద్దకు మల్కాజిగిరి మండల విద్యాశాఖ అధికారి శశిధర్ రావడంతో ఉద్రికత్త నెలకొంది. పోలీసులు జోక్యం చేసుకోవడంతో పరిస్థితి సద్దుమణిగింది. విద్యార్థి ఆత్మహత్యకు కారణమైన పాఠశాల నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని నాయకులు డిమాండ్ చేశారు. ఫీజు చెల్లించాలని ఒత్తిడి వల్లనే విద్యార్థిని మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్టు తల్లిదండ్రులు చెప్పారని, ఈమేరకు జిల్లా విద్యాశాఖ అధికారి ఆదేశాలతో పాఠశాలను సీజ్ చేసి, సీలు వేసినట్టు ఎంఈఓ తెలిపారు. ప్రస్తుతం స్కూల్ నిర్వాహకులు విజయలక్ష్మిరెడ్డి అందుబాటులో లేరని, ఈ ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తున్నామని ఎంఈఓ వివరించారు. విజయలక్ష్మిరెడ్డిపై కేసు నమోదు చేసినట్టు నేరేడ్మెట్ సీఐ నర్సింహ్మాస్వామి తెలిపారు. మల్కాజిగిరి తహసీల్ధార్ వినయలత స్కూల్‌ను పరిశీలించారు. అనంతరం విద్యార్థి తల్లిదండ్రులతో మాట్లాడారు. ప్రభుత్వ పరంగా ఆర్ధిక సహాయం అందేలా చూస్తానని చెప్పారు. విద్యార్థిని యశస్విని తల్లిదండ్రులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే మైనంపల్లి విద్యార్థి కుటుంబానికి ఎమ్మెల్యే రూ.2లక్షల సాయం శుక్రవారం మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ఈస్ట్‌కాకతీయనగర్‌లోని విద్యార్థిని యశస్విని ఇంటికి వెళ్లి తల్లిదండ్రులను పరామర్శించారు. ఫీజు చెల్లించాలని స్కూల్ యజమాన్యం యశస్వినితో తనకు ఫోన్ చేయించారని, ఒత్తిడి చేయడంతో మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకున్నట్టు విద్యార్థిని తండ్రి హరిప్రసాద్ ఎమ్మెల్యేతో వాపోయారు. ఈ విషయంపై ఎమ్మెల్యే మంత్రి కేటీఆర్‌తో మాట్లాడి బాధిత కుటుంబానికి న్యాయంచేస్తామని హామీ ఇచ్చారు. నేతల రూ.3లక్షల సాయం బీజేపీ కార్పొరేటర్ రాజ్యలక్ష్మి, టీఆర్ఎస్,బీజేపీ నేతలు బద్ధం పరుశురామ్‌రెడ్డి,సతీష్‌కుమార్, ప్రసన్ననాయుడుతోపాటు పలువురు నాయకులు కలిపి రూ.3లక్షలను అందజేస్తామన్నారు. స్కూల్ యాజమాన్యం తరపున రూ.5లక్షల ఆర్థిక సహాయం అందేలా చూస్తానని ఎమ్మెల్యేకు స్కూల్ బిల్డింగ్ యజమాని చెప్పారు. చదవండి: ఫీజు వేధింపులకు విద్యార్థిని బలి -
టెన్త్ విద్యార్థిని ఆత్మహత్య
నేరేడ్మెట్: ఫీజులు చెల్లించాలని స్కూలు యాజమాన్యం ఒత్తిడి తెచ్చిన నేపథ్యంలో మనస్తాపానికి గురైన టెన్త్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. గురువారం నేరేడ్మెట్ ఠాణా పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. నేరేడ్మెట్ పోలీసులు తెలిపిన ప్రకారం.. ఈస్ట్ కాకతీయనగర్‌లో ఉండే హరిప్రసాద్ దంపతులు కూలీలు. వీరికి ముగ్గురు కుమార్తెలు. చిన్న కుమార్తె యశస్విని (16) స్థానిక ప్రైవేట్ పాఠశాలలో 10వ తరగతి చదువుతోంది. గడిచిన మూడ్రోజులుగా స్కూల్ ఫీజు సుమారు రూ.3 వేలు చెల్లించాలని స్కూల్ యజమాన్యం తండ్రికి ఫోన్‌చేస్తూ ఒత్తిడి తెస్తోంది. దీంతో మనస్తాపానికి గురైన యశస్విని స్కూల్‌కు వెళ్లలేదు. తల్లిదండ్రులు బయటకు వెళ్లిన సమయంలో ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుందని నేరేడ్మెట్ సీఐ నర్సింహస్వామి చెప్పారు. -
నేరేడ్మెట్ కౌంటింగ్: ఆర్వో సంచలన కామెంట్స్
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో నేరేడ్మెట్ కౌంటింగ్ సందర్భంగా జరిగిన వాదోపవాదనలపై ఆర్వో లీనా కలత చెందారు. ఎన్నికల్లో తాను ఏ అభ్యర్థికి, ఏ పార్టీకి అనుకూలంగా వ్యవహరించలేదని ఆర్వో లీనా వివరించారు. ఈ మేరకు బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. నాపై పలువురు అభ్యర్థులు అనేక ఆరోపణలు చేశారు. నా విధులకు ఆటంకం కల్పించడం, నన్ను అసభ్యంగా దూషించడంపై నేరేడ్మెట్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాను. నన్ను తిట్టిన కాల్ రికార్డులు నా దగ్గర ఉన్నాయి. ఎన్నికల సంఘానికి కూడా నివేదిక ఇస్తాను. ఎన్నికల్లో నేను పారదర్శకంగా పనిచేశా. ఎవరికీ అమ్ముడుపోలేదు. నా సెల్‌ఫోన్, కాల్ రికార్డ్స్ అన్ని చూపించేందుకు సిద్ధంగా ఉన్నా' అని ఆర్వో లీనా తెలిపారు. చదవండి: (నేరేడ్మెట్లో టీఆర్ఎస్ విజయం) ఇదిలా ఉండగా నేరేడ్మెట్ కౌంటింగ్ వద్ద బీజేపీ అభ్యర్థి ఆందోళన దిగారు. రిజక్ట్ అయిన 1,300 ఓట్లను కూడా లెక్కించాలంటూ బీజేపీ అభ్యర్థి డిమాండ్ చేస్తున్నారు. కాగా 544 ఓట్లు మాత్రమే లెక్కించినట్లు రిటర్నింగ్ అధికారి తెలిపారు. 544 ఓట్లలో 278 టీఆర్ఎస్ పార్టీకి వచ్చాయి. గతంలో టీఆర్ఎస్కు 504 ఓట్ల ఆధిక్యం ఉండటంతో.. మొత్తంగా 782 ఓట్లతో టీఆర్ఎస్పార్టీ అభ్యర్థి మీనా ఉపేందర్ రెడ్డి విజయం సాధించింది. -
నేరేడ్మెట్ డివిజన్లో టీఆర్ఎస్ విజయం
-
నేరేడ్మెట్లో టీఆర్ఎస్ విజయం
సాక్షి, హైదరాబాద్: నేరేడ్మెట్లో టీఆర్ఎస్ విజయం సాధించింది. 782 ఓట్లతో టీఆర్ఎస్ అభ్యర్థి మీనా ఉపేందర్ రెడ్డి గెలిచారు. ఇతర గుర్తులున్న 544 ఓట్లలో టీఆర్ఎస్కు 278 ఓట్లు వచ్చాయి. తాజా విజయంతో జీహెచ్ఎంసీలో టీఆర్ఎస్ కార్పొరేటర్ల సంఖ్య 56కు చేరింది. తమ పార్టీ అభ్యర్ధి విజయంతో టీఆర్ఎస్ శ్రేణులు సంబరాల్లో మునిగిపోగా, బీజేపీ కార్యకర్తలు నిరుత్సాహానికి గురయ్యారు. బీజేపీ ఆందోళన నేరెడ్మెట్ కౌంటింగ్ కేంద్రం వద్ద బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. తిరస్కరణకు గురైన 1300 ఓట్లు లెక్కించాలని బీజేపీ అభ్యర్థి ప్రసన్ననాయుడు డిమాండ్ చేశారు. టీఆర్ఎస్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. పోలింగ్ కేంద్రాల్లో అవకతవకలు జరిగాయని, అధికార పార్టీకి ఎన్నికల అధికారులు అనుకూలంగా వ్యవహరించి 600కుపైగా చెల్లని ఓట్లను టీఆర్ఎస్ ఖాతాలో వేశారని ప్రసన్ననాయుడు ఇంతకుముందు ఆరోపించిన సంగతి తెలిసిందే. 8 గంటలకు మొదలైన కౌంటింగ్ కాగా, జీహెచ్ఎంసీ ఎన్నికల కౌటింగ్ సందర్భంగా నిలిచిపోయిన నేరేడ్మెట్ డివిజన్ ఓట్ల లెక్కింపు ఈ ఉదయం 8 గంటలకు మొదలైంది. ఇతర ముద్రలు ఉన్న 544 ఓట్లను కూడా పరిగణనలోకి తీసుకొని లెక్కించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘానికి హైకోర్టు సూచించింది. ఇదిలావుంటే, జీహెచ్ఎంసీ కౌంటింగ్ సమయంలో స్వస్తిక్ కాకుండా ఇతర ముద్రలతో కూడిన ఓట్లను కూడా పరిగణనలోకి తీసుకోవాలన్న రాష్ట్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులను సవాల్ చేస్తూ.. బీజేపీ ఈ నెల 4న హైకోర్టును ఆశ్రయించింది. అయితే హైకోర్టు ఎన్నికల సంఘం వాదనలతో ఏకీభవించింది. దీంతో స్వస్తిక్‌తో పాటు ఇతర ముద్రతో ఉన్న ఓట్లను పరిగణలోకి తీసుకోవాంటూ హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు ఇతర ముద్ర ఉన్న మరో 544 ఓట్లను లెక్కించిన తర్వాత నేరేడ్మెట్ ఫలితం ప్రకటించనున్నారు. కాగా, ఇప్పటికే టీఆర్ఎస్ అభ్యర్థి 504 ఓట్ల మెజారిటీతో కొనసాగుతున్నారు. -
‘నేరేడ్మెట్’ కౌంటింగ్‌కు అనుమతిచ్చిన హై కోర్టు
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాగంగా నేరేడ్మెట్ డివిజన్ ఓట్ల లెక్కింపునకు అడ్డంకి తొలగింది. బ్యాలెట్ పేపర్‌పై స్వస్తిక్ గుర్తు కాకుండా ఇతర గుర్తులు ఉన్నా వాటిని లెక్కించేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఇతర గుర్తులు ఉన్న బ్యాలెట్ పేపర్ల లెక్కింపుపై అభ్యంతరాలున్న వారు ఎన్నికల ట్రిబ్యునల్‌ను ఆశ్రయించవచ్చని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎ.అభిషేక్‌రెడ్డి సోమవారం తీర్పునిచ్చారు. స్వస్తిక్ గుర్తు కాకుండా ఇతర నిరి్ధష్టమైన గుర్తులు ఉన్నా వాటిని లెక్కించేందుకు అనుమతిస్తూ ఈ నెల 3న ఎన్నికల కమిషన్ జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ బీజేపీ గ్రేటర్ హైదరాబాద్ ఇన్చార్జీ అంథోనిరెడ్డితోపాటు మరొకరు దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయమూర్తి సోమవారం విచారించారు. స్వస్తిక్ గుర్తు కాకుండా ఇతర గుర్తులు ఉన్న ఓట్లను లెక్కించడానికి వీల్లేదని పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది డి.ప్రకాష్‌రెడ్డి వాదనలు వినిపించారు. ఏ గుర్తు ఉన్నా వాటిని లెక్కించాలంటూ ఎన్నికల కమిషన్ అర్థరాత్రి ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు. నేరెడ్మెట్ డివిజన్లోని ఓ పోలింగ్ బూత్‌లో స్వస్తిక్ గుర్తుకు బదులుగా సిబ్బంది పోలింగ్ కేంద్రాన్ని తెలిపే గుర్తును ఇచ్చారని, కొంతసేపటి తర్వాత ఈ తప్పును గుర్తించి సరిచేశారని ఎన్నికల కమిషన్ తరఫున సీనియర్ న్యాయవాది విద్యాసాగర్ వాదనలు వినిపించారు. అప్పటికే మరో గుర్తుతో ఓట్లు పడిన విషయాన్ని పోలింగ్ సిబ్బంది తెలియజేయడంతో ఆ ఓట్లను కూడా లెక్కించాలని 3వ తేదీ సాయంత్రం ఉత్తర్వులు ఇచ్చామని తెలిపారు. నేరేడ్మెట్ డివిజన్లో మొత్తం 25,136 ఓట్లకు గాను, 24,612 ఓట్లను లెక్కించామని, ఇతర గుర్తులు ఉన్న 544 ఓట్లను మాత్రం లెక్కించకుండా పక్కనపెట్టామని పేర్కొన్నారు. ఇప్పటికే టీఆర్ఎస్ 504 ఓట్ల మెజారిటీలో ఉందని, బూత్ నంబర్ 50లో ఎన్నికల సిబ్బంది పొరపాటు కారణంగా ఓటర్ల మనోగతం వృథా కాకూడదనే ఉద్దేశంతోనే ఇతర గుర్తులు ఉన్న ఓట్లను కూడా లెక్కించేందుకు అనుమతి ఇచ్చామని, ఇందులో ఎటువంటి దురుద్దేశం లేదని వివరించారు. ఈ వాదనతో న్యాయమూర్తి ఏకీభవించారు. (చదవండి: ఆ ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోం) ఈ నెల 9న ఓట్ల లెక్కింపు... నేరేడ్మెట్: నేరేడ్మెట్ డివిజన్ కార్పొరేటర్ ఎన్నికపై కొనసాగుతున్న సస్పెన్షన్‌కు కోర్టు తీర్పుతో తెరపడింది. ఈ నెల 9న నేరేడ్మెట్లోని భవన్స్ కళాశాలలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ సెంటర్ (డీఆర్సీ)లో 544 ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టనున్నట్లు మల్కాజిగిరి ఉప ఎన్నికల అధికారి దశరథ్ చెప్పారు. -
నేరేడ్మెట్ కార్పొరేటర్ ఎన్నికపై హైకోర్టు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: నేరేడ్మెట్ డివిజన్లో జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితం వెల్లడికి అడ్డంకి తొలగింది. నేరేడ్మెట్ కార్పొరేటర్ ఎన్నికపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది.ఇతర ముద్రతో ఉన్న ఓట్లను పరిగణనలోకి తీసుకునేందుకు హైకోర్టు అనుమతి సోమవారం ఆదేశాలు ఇచ్చింది. స్వస్తిక్ గుర్తు బదులు మరొక గుర్తుకు వచ్చిన 544 ఓట్లను లెక్కించాలంటూ తీర్పునిచ్చిన హైకోర్టు... లెక్కించకుండా మిగిలిపోయిన ఓట్లను పరిగణలోకి తీసుకోవాలని ఆదేశించింది. స్వస్తిక్ గుర్తు కాకుండా ఇతర గుర్తులు ఉంటే... రిటర్నింగ్ ఆఫీసరే తుది నిర్ణయం తీసుకోవాలన్న హైకోర్టు ఎన్నికల కమిషన్‌కు విచక్షణ అధికారం ఉంటుందని న్యాయస్థానం పేర్కొంది. అలాగే ఎన్నికల సంఘం వేసిన పిటిషన్‌ను న్యాయస్థానం తోసిపుచ్చింది. స్వస్తిక్ గుర్తుతో పాటు ఇతర గుర్తులను పరిగణనలోకి తీసుకోవాలని ఎన్నికల సంఘం ఉత్తర్వులు ఇవ్వగా, దాన్ని సవాల్ చేస్తూ బీజేపీ నేతలు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఇరు పక్షాల వాదనలు విన్నఅనంతరం హైకోర్టు ఈ మేరకు తీర్పు నిచ్చింది. అలాగే బీజేపీ లీగల్ సెల్ ఇంచార్జి ఆంటోనీ రెడ్డి పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. ఎన్నికపై వివాదం ఉంటే ఎన్నికల ట్రిబ్యునల్‌ను ఆశ్రయించ వచ్చునన్న న్యాయస్థానం తెలిపింది. దీంతో నేరేడ్మెట్ ఎన్నికల ఉత్కంఠకు తెరపడింది. కాగా ఈనెల 1న జరిగిన పోలింగ్‌లో డివిజన్లోని చాలా పోలింగ్ కేంద్రాల్లో అవకతవకలు జరిగాయని, అధికార పార్టీకి ఎన్నికల అధికారులు అనుకూలంగా వ్యవహరించి 600కుపైగా చెల్లని ఓట్లను టీఆర్ఎస్ ఖాతాలో వేశారని బీజేపీ అభ్యర్థి ప్రసన్ననాయుడు ఆరోపించారు. తమతో పాటు కాంగ్రెస్ పార్టీ ఈ విషయమై ఎన్నికల అధికారిపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు ఆమె వివరించారు. డివిజన్లో మొత్తం పోలైన ఓట్లకు, కౌటింగ్లో అధికారులు చెబుతున్న ఓట్ల సంఖ్యకు మధ్య తేడా ఉందన్నారు. ఇక 50వ పోలింగ్ కేంద్రంలోని 544 ఓట్లపై స్వస్తిక్ గుర్తుకు బదులు వేలిముద్రతో పాటు వేరే ఇంకు గుర్తులు ఉన్న అంశం కోర్టు విచారణలో ఉందని, ఈ ఓట్లపై కోర్టు నిర్ణయానికి కట్టుబడి ఉంటానన్నారు. పొరపాట్లకు కారణమైన అధికారులపై కోర్టుకు వెళతానని ప్రసన్న నాయుడు స్పష్టం చేశారు. -
‘ఆ ఫలితంపై అత్యవసర జోక్యం అవసరం లేదు’
సాక్షి, హైదరాబాద్ : జీహెచ్ఎంసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు నేరెడ్మెట్ డివిజన్ మినహా పూర్తయిన సంగతి తెలిసిందే. నేరెడ్‌మెట్‌లో స్వస్తిక్ ముద్ర కాకుండా ఇతర ముద్ర ఉన్న ఓట్ల సంఖ్య ఎక్కువగా ఉన్నందున ఫలితాలు వాయిదా వేయాల్సిందిగా హైకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఇతర ముద్రల ఓట్లపై సింగిల్‌జడ్జి ఉత్తర్వులపై హైకోర్టులో ఎస్ఈసీ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారించిన ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం.. సింగిల్‌జడ్జి మధ్యంతర ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. నేరెడ్‌మెట్‌లో ఫలితం నిలిచిపోయిందని ఎస్ఈసీ తెలపగా, అందుకు సిబ్బంది శిక్షణ లోపమే కారణమని హైకోర్టు అభిప్రాయపడింది. సింగిల్ జడ్జి వద్ద సోమవారమే విచారణ ఉన్నందున అత్యవసరంగా జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని ధర్మాసనం పేర్కొంది. సింగిల్ జడ్జి వద్ద విచారణ పూర్తయ్యాక ఒకవేళ అభ్యంతరం ఉంటే అప్పీల్ చేయాలని తెలిపింది. ఇందుకు గాను సోమవారం ఉదయమే ఈ అంశంపై విచారణ జరపాలని సింగిల్ జడ్జికి ఆదేశాలు జారీ చేసింది. (నేరేడ్మెట్ డివిజన్ ఓట్ల లెక్కింపు నిలిపివేత) -
అమ్మమ్మ ఇంట్లో మనవరాలి చోరీ
నేరేడ్మెట్ : సొంత అమ్మమ్మ ఇంట్లోనే చోరీ చేసిన మనవరాలితోపాటు ఆమె స్నేహితుడిని నేరేడ్మెట్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. బుధవారం మల్కాజిగిరి డీసీపీ రక్షితమూర్తి తెలిపిన మేరకు.. కేశవనగర్‌కు చెందిన డీజే ఆపరేటర్ పర్షా అజయ్(21), దమ్మాయిగూడలోని వీఆర్ఆర్ ఎన్‌క్లేవ్‌లో నివాసం ఉంటున్న ఫ్యాషన్ డిజైనర్ పట్రిసియా(21)లు రెండేళ్లుగా స్నేహితులుగా కొనసాగుతున్నారు. లాక్డౌన్ అమల్లోకి రావడంతో ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నాడు. పట్రిసియా తన బంగారు గొలుసు ఇవ్వగా అమ్మేశాడు. చెడు అలవాట్లకు బానిసైన అజయ్ డబ్బుల కోసం స్నేహితురాలి సొంత అమ్మమ్మ అమిలియా ఇంట్లో చోరీకి పధకం వేశారు. ఇందులో భాగంగా గత నెల 31వ తేదీన డిఫెన్స్ కాలనీలోని అమ్మమ్మ ఇంటికి మనవరాలు పట్రిసియా వెళ్లి అక్కడే ఉంది. అదే రోజు అర్థరాత్రి అమ్మమ్మ నిద్రిస్తున్న సమయంలో ఇంట్లో ఉన్న సుమారు 18 తులాల బంగారు ఆభరణాలను చోరీ చేసింది. తన స్నేహితుడు అజయ్‌కు ఫోన్ చేసి డిఫెన్స్ కాలనీకి పిలిపించి చోరీ చేసిన అభరణాలను అప్పగించింది. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పట్రిసియా, అజయ్‌లు నిందితులుగా తేలడంతో ఇద్దరినీ అరెస్టు చేసి, చోరీ సోత్తును పోలీసులు రికవరీ చేశారని డీసీపీ చెప్పారు. బాలికపై లైంగిక దాడి.. యువకుడి అరెస్టు చైతన్యపురి: మైనర్ బాలికపై అఘాయిత్యం చేసిన యువకుడిని చైతన్యపురి పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన మేరకు.. న్యూమారుతీనగర్‌లో నివసించే తంగళ్లపల్లి మణికంఠ (20)ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. సెల్‌ఫోన్ ద్వారా పద్నాలుగు సంవత్సరాల ఓ మైనర్ బాలికతో పరిచయం పెంచుకున్నాడు. తరచూ ఫోన్లో మాట్లాడే వాడు. గత శుక్రవారం మాయమాటలు చెప్పి బాలికను మన్సూరాబాద్‌లోని ఓ గదికి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు.బాధితురాలు తల్లిదండ్రులకు చెప్పటంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంగళవారం సాయంత్రం నిందితుడు మణికంఠను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. -
కరోనాతో భర్త.. బంగ్లాపై నుంచి దూకి భార్య!
సాక్షి, హైదరాబాద్: బతుకుదెరువు కోసం నగరానికి వచ్చి దంపతుల జీవితాలు విషాదంగా ముగిశాయి. కరోనా మహమ్మారి భర్తను కబళించగా...భర్త మరణాన్ని తట్టులేక భార్య బంగ్లా (మూడంతస్తుల)పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది.గురువారం నేరేడ్మెట్ ఠాణా పరిధిలో ఈ విషాదం చోటు చేసుకుంది. నేరేడ్మెట్ సీఐ నర్సింహస్వామి కథనం ప్రకారం... నల్గొండ జిల్లాకు చెందిన దంపతులు వెంకటేష్ (56), తడకమల్ల ధనలక్ష్మి(55)లు నేరేడ్మెట్ ఠాణా పరిధిలోని అంబేడ్కర్ నగర్‌లోని ఓ బిల్డింగ్‌లో అద్దెకుంటున్నారు. భార్య ధనలక్ష్మి ఏఎస్ రావునగర్‌లోని సూపర్ మార్కెట్లో హెల్ఫర్‌గా, భర్త కన్స్ట్రక్షన్ సంస్థలో సూపర్వైజర్గా పని చేస్తున్నారు. వీరికి సంతానం లేదు. కొన్ని రోజుల క్రితం భర్తకు కోవిడ్ పాజిటివ్‌గా తేలింది. (నాగరాజు రెండో లాకర్లో భారీగా బంగారం) అప్పటి నుంచి ఇంట్లోనే ఉంటూ చికిత్స పొందుతున్నాడు. భార్య యథావిధిగా గురువారం పనికి వెళ్లి మధ్యాహ్నం తిరిగి వచ్చేసరికి ఇంట్లో ఉన్న భర్త మృతి చెంది ఉన్నాడు. పిల్లలు లేరు... భర్త మరణించడంతో తట్టులేక మనస్తాపంతో భార్య మూడంతస్తుల బంగ్లాపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికల ద్వారా సమాచారం అందుకున్న నేరేడ్మెట్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతదేహాలను ఆసుపత్రికి తరలించి, కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
భార్యకు విడాకులు.. రెండో భార్య కుమార్తెపై కన్ను
సాక్షి, హైదరాబాద్ : తండ్రిగా ఉంటానని నమ్మించి కూతురు లాంటి బాలికపై ఓ వ్యక్తి కన్నేశాడు. మేడ్చల్ జిల్లా నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసున్న ఈ సంఘటన సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేసింది. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జయరాం అనే వ్యక్తి సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా హైదరాబాద్‌లో విధులు నిర్వర్తిస్తున్నాడు. భార్యతో విభేదాల కారణంగా కొన్నేళ్ల క్రితం విడాకులు ఇచ్చాడు. అనంతరం ఒంటరితనం భరించలేక మరో మహిళను వివాహం చేసుకున్నాడు. అయితే అప్పటికే ఆమెకు (రెండోభార్య) 17 ఏళ్ల కుమార్తె ఉంది. వివాహం అనంతరం తన కుమార్తెను బంధువుల వద్ద ఉంచుతానని ఆమె చెప్పింది. దానికి అంగీకరించని జయరాం.. ఆ బాలికను తమతోనే ఉంచుకుందామని, తన సొంత కుమార్తెలా చూసుకుంటానని భార్యకు భరోసా ఇచ్చాడు. భర్త మాటలు గుడ్డిగా నమ్మిన భార్య.. తన కుమార్తెను తీసుకుని వచ్చింది. ఓ ఏడాది గడిచిన అనంతరం జయరాంలోని మృగవాంఛ బయటపడింది. కూతురులాంటి ఆమెపై కన్నుపడింది. తల్లి లేని సమయంలో బాలికను బెదిరించి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయం కాస్తా భార్యకు తెలియడంతో బంధువులతో తన గోడును వెళ్లబోసుకుంది. భర్తపై భయం కారణంగా నిలదీయలేక సమీప బంధువుల ఇంటి వద్ద బాలికను ఉంచింది. అప్పటికే రెండో భార్య తీరుతో ఆగ్రహంగా ఉన్న జయరాం బాలికను తన నుంచి దూరం చేయడాన్ని సహించలేకపోయాడు. వెంటనే ఆమెను తన వద్దకు తీసుకురావాలని భార్యపై ఒత్తిడి చేయడం ప్రారంభించాడు. అంతటితో ఆగకుండా వేధింపులకు దిగాడు. భర్త చేష్టలను భరించలేని రెండోభార్య.. స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధిత మహిళ ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. అయితే జయరాంపై ఏమాత్రం తీవ్రతలేని సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. -
పసికందును అమ్మకానికి పెట్టిన తల్లి!
సాక్షి, హైదరాబాద్ : నవ మాసాలు మోసి జన్మనించిన శిశువుని కన్న తల్లే అమ్మకానికి పెట్టిన ఘటన నెరేడ్మెట్ పీఎస్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల మేరకు.. అత్యాచారం కేసులో బాధితురాలైన ఓ మహిళ ఇటీవల పాపకు జన్మనిచ్చింది. ఈనెల 12వ తేదీన ప్రసవం కోసం భువనగిరి జిల్లా ఆస్పత్రికి వచ్చిన బాధితురాలికి 10 రోజుల క్రితం పండంటి ఆడపిల్ల జన్మించింది. (25 మంది కిడ్నాప్!: నలుగురి హత్య) ఏ కష్టం వచ్చిందో ఏమో గానీ బాధితురాలు పుట్టిన పసికందును తెలిసిన వ్యక్తుల ద్వారా ఘట్కేసర్ మండలం ఎదులాబాద్‌కు చెందిన వారికి 60 వేల రూపాయలకు విక్రయించింది. ఈ క్రమంలో డీఎన్ఏ పరీక్ష కోసం పాపను తీసుకు రావాలని నేరెడ్మెట్ పోలీసులు కోరగా.. పసికందు చనిపోయిందని కుటుంబ సభ్యులు చెప్పి పోలీసులను తప్పుదోవ పట్టించారు. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు విచారణ చేపట్టగా.. పాపను విక్రయించినట్లు గుర్తించారు. పాపను సురక్షితంగా రక్షించిన పోలీసులు శిశువును ఘట్కేసర్.. ఎదులాబాద్‌లోని చైల్డ్ కేర్ సెంటర్‌కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. (మల్కాజ్గిరి ఏసీపీ ఇంటిపై ఏసీబీ దాడులు) -
మంత్రి కేటీఆర్, మేయర్‌పై సుమేధ తల్లి ఫిర్యాదు
నేరేడ్మెట్ : పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, నగర మేయర్ బొంతు రాంమోహన్, జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్, మల్కాజిగిరి మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులు, స్థానిక ఎమ్మెల్మే, కార్పొరేటర్లపై ఇటీవల మృతి చెందిన చిన్నారి సుమేధ కపూరియా తల్లి సుకన్య కపూరియ నేరేడ్మెట్ ఠాణాలో సోమవారం ఫిర్యాదు చేశారు. వర్షా కాలంలో ఓపెన్‌నాలాలు పొంగి ప్రవహించడం వల్ల ఈస్ట్‌దీనదయాళ్‌నగర్ కాలనీతో వరదనీటితో ముంపునకు గురవుతుందన్నారు. ఓపెన్ నాలాల సమస్యను పరిష్కారించాలని ఎన్నోసార్లు జీహెచ్ఎంసీ అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోలేదన్నారు. గతంలో ఓగర్భిణి నాలాలో పడి కొట్టుకుపోతుంటే స్థానికులు కాపాడారని, ఈనెల 17న తన కూరుతు సుమేధ నాలాలో పడి మరణించిందన్నారు. కేటీఆర్, మేయర్, జీహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యం,బాధ్యతారాహిత్యమే తన కూతురు మృతికి కారణమని, వారిపై చర్యలు తీసుకోవాలనిఫిర్యాదులో పేర్కొన్నారు. సుమేధ తల్లి ఫిర్యాదు చేశారని, ఈ మేరకు దర్యాప్తు చేస్తామని సీఐ నర్సింహ్మాస్వామి చెప్పారు. -
కల్తీ బొగ్గు దందా గుట్టురట్టు
సాక్షి, నేరేడ్మెట్ (హైదరాబాద్): పెద్ద పరిశ్రమలు కొనుగోలు చేసిన నాణ్యమైన బొగ్గును దారి మళ్లించి కాజేసి... సగం లోడు నాసిరకం బొగ్గును నింపుతూ మోసం చేస్తున్న కల్తీ మాఫియా గుట్టును ఎల్బీనగర్ జోన్ ఎస్ఓటీ, ఇబ్రహీంపట్నం పోలీసులు రట్టు చేశారు. లారీ యజమానులు, డ్రైవర్లతో కుమ్మక్కై బడా పరిశ్రమలను బురిడీ కొట్టిస్తూ కల్తీ బొగ్గు దందా చేస్తున్న 8మంది నిందితులను అరెస్టు చేశారు. 1.050 టన్నుల నాణ్యమైన బొగ్గుతోపాటు 700 టన్నుల నాసిరకం బొగ్గు, రెండు లారీలు, జేసీబీలు, రూ.2.50 లక్షల నగదుతో కలిపి మొత్తం రూ.1.62 కోట్ల విలువైన సొత్తును పోలీసులు సీజ్ చేశారు. శుక్రవారం నేరేడ్మెట్లోని రాచకొండ పోలీసు కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీ మహేష్‌భగవత్ వివరాలు వెల్లడించారు. హస్తినాపురానికి చెందిన గుండె రాజు 2014 నుంచి ఇబ్రహీంపట్నం మండలం రాందాస్‌పల్లిలో బొగ్గు డంపింగ్ యార్డును ఏర్పాటు చేసుకొని బొగ్గు సరఫరా వ్యాపా రం ప్రారంభించాడు. ఈ యార్డు పక్కనే గగన్‌పహాడ్‌కు చెందిన అమీర్ మహ్మద్ డంపింగ్ యార్డు కూడా ఉంది. వీరిద్దరూ కొత్తగూడెం, సింగరేణి నుంచి తక్కువ నాణ్యత ఉన్న బొగ్గు, బొగ్గు బూడిదను కొనుగోలు చేసి తమ డంపింగ్ యార్డులకు తరలిస్తారు. అనంతరం అదే బొగ్గును స్థాని క చిన్నతరహా పరిశ్రమలకు విక్రయిస్తూ తమ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. ప్రణాళిక ఇలా... విద్యుత్ ప్లాంట్లు, సిమెంట్, కాగితం తయారీ, అల్యూమినియం ప్లాంట్లు, ఫార్మా కంపె నీలు, ఉక్కు పరిశ్రమలకు అధిక నాణ్యత కలిగిన బొగ్గు అవసరం. లారీ డ్రైవర్లకు డబ్బులు ఆశజూపి సింగరేణి కాలరీస్ నుంచి, విదేశీ బొగ్గుతో ఏపీలోని కృష్ణపట్నం పోర్టు నుంచి వచ్చే నాణ్యమైన బొగ్గు లారీ లను తమ డంపింగ్ యార్డులకు తీసు కొచ్చి... సగం లోడు ఖాళీ చేసి నాసిరకం బొగ్గును నింపి పరిశ్రమలకు పంపేవారు. బొగ్గు కల్తీ జరుగుతోందనే విశ్వసనీయ సమాచారం మేరకు శుక్రవారం పోలీసులు డంపింగ్ యార్డులపై దాడి చేసి, నిందితులు గుండె రాజు, కాట్రవత్ సోమ, చల్లా అమరేందర్‌రెడ్డి, కురతాల మల్లేష్, నిజాముద్దీన్, ఎరుకల అంజయ్య, సగరాల సత్యం, రిజ్వాన్‌లను అరెస్టు చేశారు. మరో ముగ్గురు నిందితులు ఉత్తంపల్లి లక్ష్మణ్, అమీర్ మహ్మద్, ఉమాకొండ పురుషోత్తంరెడ్డిలు పరారీలో ఉన్నారని తెలిపారు. -
ఫొటోగ్రాఫర్ వికృత చేష్టలు..
సాక్షి, హైదరాబాద్: నగరంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఫొటో కోసం వెళ్లిన ఓ మైనర్ బాలికపై ఫొటోగ్రాఫర్ లైంగికదాడికి యత్నించాడు. ఈ ఘటన మంగళవారం ఉదయం నేరేడ్మెట్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాలు.. సైనిక్‌పురిలోని ఆర్.ఎస్. స్టూడియోలో ఫొటో దిగాడానికి వెళ్లిన మైనర్ బాలికపై ఫొటోగ్రాఫర్ సలీం అసభ్యంగా ప్రవర్తించాడు. ఫొటో తీస్తానంటూ బాలికను అసభ్యంగా తాకుతూ.. లైంగిక దాడికి యత్నించాడు. దీంతో బాలిక.. సలీం వికృత చేష్టలకు బయపడి అరుచుకుంటూ బయటకు పరుగులు తీసింది. అది గమనించిన స్థానికులు అతగాడికి దేహశుద్ధి చేశారు. ఇక ఈ ఘటనపై బాలిక తల్లి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా గాయాలపాలైన సలీం ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. -
కీచక ఫోటో గ్రాఫర్
-
సవతి తల్లిని వెంబడించి.. కర్రతో మోది..
నేరేడ్మెట్: సవతితల్లి దారుణ హత్యకు గురైన ఘటన నేరేడ్మెట్ పోలీసుస్టేషన్ పరిధిలోని దీన్‌దయాళ్‌నగర్‌లో మంగళవారం సాయంత్రం జరిగింది. కుటుంబ కలహాలే హత్యకు కారణమని ప్రాథమిక విచారణలో తేలినట్టు నేరేడ్మెట్ సీఐ నర్సింహస్వామి తెలిపారు. సీఐ తెలిపిన వివరాల ప్రకారం.. వినాయకనగర్‌లో నివాసం ఉంటున్న యాదగిరి (60) మొదటి భార్య భారతమ్మ రెండేళ్ల క్రితమే మరణించింది. యాదగిరికి ఇద్దరు కొడుకులు, ఒక కూతురు. పెద్ద కొడుకు వేణుగోపాల్ విజయవాడలో ఉంటున్నాడు. పాల వ్యాపారం చేసే చిన్నకొడుకు కృష్ణప్రసాద్‌తో కలిసి యాదగిరి వినాయకనగర్‌లో ఉంటున్నాడు. రైల్వే లో టెక్నిషియన్‌గా పని చేసి యాదగిరి గత ఏడాది డిసెంబర్లో ఉద్యోగ విరమణ చేశాడు. సుమారు రూ.25 లక్షలు ఉద్యోగ విరమణæ డబ్బులు వచ్చాయి. తనకు తోడు కోసం తెలిసిన వారి ద్వారా పరిచయమైన లలిత (44)ను యాదగిరి గత ఏడాది నవంబర్‌లో ఆర్యసమాజంలో పెళ్లి చేసుకున్నాడు. అనంతరం ఇంట్లో కుటుంబ కలహాలు మొదలవ్వడంతో నెల క్రితం భార్య లలితతో కలిసి యాదగిరి దీన్‌దయాళ్‌నగర్ రోడ్ నంబర్–2 ఆర్కే ఎన్‌క్లేవ్‌లో ఉంటున్నాడు. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం ఆర్కే ఎన్‌క్లేవ్‌కు వచ్చినట్టు భావిస్తున్న కృష్ణప్రసాద్ ఇంట్లో ఒంటరిగా ఉన్న సవతితల్లిపై కర్రతో దాడికి పాల్పడ్డాడు. ఆమె కేకలు వేస్తూ ఇంట్లోంచి బయటకు పరుగులు తీసి, ప్రసన్న నిలయం సమీపంలోకి చేరుకుంది. వెంబడించిన కృష్ణప్రసాద్ ఆమె తలపై బలంగా కొట్టడంతో అక్కడికక్కడే కుప్పకూలింది. నిందితుడు పరారయ్యాడు. మల్కాజిగిరి డీసీపీ రక్షిత కె మూర్తి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. యాదగిరి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు, సీఐ చెప్పారు. -
నానీ.. లే తల్లి...నాన్నకు ఫోనెప్పుడు చేస్తావు
నేరేడ్మెట్: ‘నానీ లే తల్లి..బిడ్డా లేమ్మా...నాన్నకు ఫోనెప్పుడు చేస్తావు..తమ్ముడికి ఇక జాగ్రత్తలు ఎవరు చెప్తారు...తాతను పేరుపెట్టి ఎవరు పిలుస్తారమ్మా... గొప్ప దానివవుతావని చెప్పావు..ఇక కనిపించకుండా వెళ్లిపోతున్నావా తల్లీ...మేమేం పాపం చేశాం దేవుడా..మాకు కడుపుకోత మిగిల్చావు’అంటూ యువ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎల్ల చరితారెడ్డి మృతదేహం చూసిన తల్లిదండ్రులు శోభ, చంద్రారెడ్డిలు గుండెలవిసేలా రోదించారు. డిసెంబర్ 27న అమెరికాలోని మిచిగావ్ రాష్ట్రంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో చరితారెడ్డి దుర్మరణం చెందారు. అక్కడ ఆమె గుండె, కాలేయం, మూత్రపిండాలు, నేత్రాలు చావుబతుకుల మధ్య ఉన్న తొమ్మిది మందికి అవయవదానం చేశారు.అనంతరం అమెరికాలో భారతీయ రాయబార కార్యాలయం అనుమతి(ఎన్ఓసీ)తీసుకొని అక్కడి నుంచి ఆదివారం ఉదయం 8.30గంటలకు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు చరితారెడ్డి మృతదేహం తెచ్చారు. మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, చరితారెడ్డి బంధువులు, పలువురు కార్పొరేటర్లు ఎయిర్పోర్ట్ వద్దకు చేరుకొని, సంబంధిత అధికారులతో మాట్లాడారు. అంబులెన్స్‌లో ఉదయం 11గంటలకు నేరేడ్మెట్ రేణుకానగర్‌లోని ఆమె ఇంటికి మృతదేహాన్ని తీసుకువచ్చారు. కుమార్తె మృతదేహాన్ని చూడగానే తల్లిదండ్రులు,కుటుంబీకులు భోరున విలపించారు. నేరేడ్మెట్ భరణి కాలనీలోని శ్మశాన వాటికలో తండ్రి చంద్రారెడ్డి కుమార్తె చితికి నిప్పంటించి అంతిమ క్రియలు చేశారు. వైఎస్ఆర్సీపీ తెలంగాణ రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి సుమతీమోహన్, ప్రగతిశీల మహిళా సంఘం జాతీయ కన్వీనర్ సంధ్య, వివిధ పార్టీల నాయకులు,కార్పొరేటర్లు, సన్నిహితులు చరితారెడ్డికి నివాళులర్పించారు. -
హైదరాబాద్‌కు చరితారెడ్డి మృతదేహం
-
హైదరాబాద్‌కు చరితారెడ్డి మృతదేహం
సాక్షి, హైదరాబాద్ : అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన యువ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎల్ల చరితారెడ్డి మృతదేహం హైదరాబాద్‌కు చేరింది. ఆదివారం ఉదయం ఆమె మృతదేహాన్ని నేరేడ్మెట్లోని రేణుకా నగర్‌కు తీసుకు వచ్చారు. గత నెల 27వ తేదీన అమెరికాలోని మిచిగావ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో చరితా రెడ్డి దుర్మరణం చెందిన సంగతి తెలిసిందే. రెండు రోజుల క్రితమే అమెరికాలోఅవయవదాన ప్రక్రియ ముగిసింది. అనంతరం అమెరికా నుంచి విమానంలో దుబాయ్ మీదుగా శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు ఇవాళ ఉదయం మృతదేహం చేరుకుంది. అక్కడ నుంచి చరితా రెడ్డి నివాసానికి మృతదేహాన్ని తరలించారు. స్థానిక శ్మశానవాటికలో ఆమె అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేశారు. కాగా మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావుతోపాటు పలువురు టీఆర్ఎస్ నేతలు, కార్పొరేటర్లు రేణుకా నగర్‌లోని చరితారెడ్డి ఇంటికి శనివారం వెళ్లి ఆమె తండ్రి చంద్రారెడ్డి, తాతా మల్లారెడ్డితోపాటు ఇతర కుటుంబసభ్యులను పరామర్శించారు. చదవండి: చరితారెడ్డిపై విధి చిన్నచూపు.. అమెరికాలో హైదరాబాద్ యువతి దుర్మరణం