
యశస్విని (ఫైల్)
నేరేడ్‌మెట్: ఫీజులు చెల్లించాలని స్కూలు యాజమాన్యం ఒత్తిడి తెచ్చిన నేపథ్యంలో మనస్తాపానికి గురైన టెన్త్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. గురువారం నేరేడ్‌మెట్ ఠాణా పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. నేరేడ్‌మెట్ పోలీసులు తెలిపిన ప్రకారం.. ఈస్ట్ కాకతీయనగర్‌లో ఉండే హరిప్రసాద్ దంపతులు కూలీలు. వీరికి ముగ్గురు కుమార్తెలు. చిన్న కుమార్తె యశస్విని (16) స్థానిక ప్రైవేట్ పాఠశాలలో 10వ తరగతి చదువుతోంది. గడిచిన మూడ్రోజులుగా స్కూల్ ఫీజు సుమారు రూ.3 వేలు చెల్లించాలని స్కూల్ యజమాన్యం తండ్రికి ఫోన్‌చేస్తూ ఒత్తిడి తెస్తోంది. దీంతో మనస్తాపానికి గురైన యశస్విని స్కూల్‌కు వెళ్లలేదు. తల్లిదండ్రులు బయటకు వెళ్లిన సమయంలో ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుందని నేరేడ్‌మెట్ సీఐ నర్సింహస్వామి చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment