హైదరాబాద్: ప్రజలకు కాపలాగా ఉండాల్సిన పోలీసులు పెట్రేగిపోతున్నారు. సంయమనంతో వ్యవహరించి జనం సమస్యలు పరిష్కరించాల్సిన రక్షకభటులు రెచ్చిపోతున్నారు. అధికారం ఉందన్న అహంకారంతో సామాన్య ప్రజల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారు. విచక్షణారహితంగా వ్యవహరిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు.
హైదరాబాద్ నేరేడ్‌మెట్ పోలీసుస్టేషన్లో సీఐ రమేష్ వీరంగం సృష్టించాడు. రాకేష్ అనే యువకుడిని విచక్షణారహితంగా చితకబాదాడు. ఈ ఘటనలో రాకేష్‌కు తీవ్రగాయాలయ్యాయి. దీంతో అతడి తరపు బంధువులు ఆందోళనకు దిగారు. దురుసుగా ప్రవర్తించిన సీఐ రమేష్‌పై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు.
యువకుడిని చితకబాదిన సీఐ
Published Sun, Oct 13 2013 2:31 PM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement
Advertisement