
నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టిన మల్కాజ్‌గిరి డీసీపీ ఉమా మహేశ్వర శర్మ
సాక్షి, మేడ్చల్ : వరుస చోరీలకు పాల్పడుతున్న కిలాడీ దంపతులకు పోలీసులు చెక్‌పెట్టారు. టూలెట్ బోర్డు తగిలించి ఉన్న ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న భార్యభర్తలను అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. రాచకొండ కమీషనరేట్ నేరేడుమెట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గత కొంతకాలంగా వరుస చోరీలు జరుగుతున్నాయి. వీటిపై నిఘా ఉంచిన పోలీసులు చోరీలకు పాల్పడుతున్న భార్యభర్తలను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 14 తులాల బంగారు ఆభరణాలు, రెండు మొబైల్ ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు.
భార్యభర్తలు ఇద్దరు చాలా చాకచక్యంగా చోరీలకు పాల్పడేవారు. టూలెట్ బోర్డు తగిలించిన ఇళ్లను టార్గెట్ చేసుకొని దొంగతనాలు చేసేవారు. పిల్లలను ఎత్తుకొని అద్దెకు ఇళ్లు కావాలంటూ ఇంట్లోకి ప్రవేశించి సొమ్ము స్వాహా చేస్తారు. చివరకు పోలీసులకు చిక్కారు. మల్కాజ్‌గిరి డీసీపీ ఉమా మహేశ్వర శర్మ శనివారం ఉదయం నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు.
Comments
Please login to add a commentAdd a comment