హైదరాబాద్ క్రైం: రైల్వే ట్రాక్‌పై తలపెట్టి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన నేరేడ్‌మెట్ రామకృష్ణాపురంలో ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. వాజ్‌పేయినగర్ కాలనీకి చెందిన అస్లం(22) కారు డ్రైవింగ్ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. శనివారం ఉదయం ఇంటినుంచి బయలుదేరిన అస్లం తిరిగి ఇంటికి చేరుకోలేదు. నేరేడ్మేట్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ సమీపంలో మృతదేహం ఉన్న విషయం తెలుసుకున్న అతని బంధువులు అక్కడికి చేరుకుని చనిపోయిన వ్యక్తి అస్లం అని గుర్తించారు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అస్లంది ఆత్మహత్యా లేక ఎవరైన చంపి తీసుకొచ్చి ఇక్కడ వేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.