
సాక్షి, హైదరాబాద్ : అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఎల్ల చరితారెడ్డి మృతదేహం హైదరాబాద్‌కు చేరింది. ఆదివారం ఉదయం ఆమె మృతదేహాన్ని నేరేడ్‌మెట్‌లోని రేణుకా నగర్‌కు తీసుకు వచ్చారు. గత నెల 27వ తేదీన అమెరికాలోని మిచిగావ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో చరితా రెడ్డి దుర్మరణం చెందిన సంగతి తెలిసిందే. రెండు రోజుల క్రితమే అమెరికాలోఅవయవదాన ప్రక్రియ ముగిసింది.
అనంతరం అమెరికా నుంచి విమానంలో దుబాయ్ మీదుగా శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు ఇవాళ ఉదయం మృతదేహం చేరుకుంది. అక్కడ నుంచి చరితా రెడ్డి నివాసానికి మృతదేహాన్ని తరలించారు. స్థానిక శ్మశానవాటికలో ఆమె అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేశారు. కాగా మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావుతోపాటు పలువురు టీఆర్‌ఎస్ నేతలు, కార్పొరేటర్లు రేణుకా నగర్‌లోని చరితారెడ్డి ఇంటికి శనివారం వెళ్లి ఆమె తండ్రి చంద్రారెడ్డి, తాతా మల్లారెడ్డితోపాటు ఇతర కుటుంబసభ్యులను పరామర్శించారు.
చదవండి:
Comments
Please login to add a commentAdd a comment