
సాక్షి, హైదరాబాద్: సాధారణంగా ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తే ఒకటి, రెండు ఫైన్‌లు ఉంటేనే మనం గాబరపడిపోతుంటాం. ఫైన్ చెల్లించి జాగ్రత్త పడితే మేలని భావిస్తుంటాం. అయితే తాజాగా ఓ వ్యక్తికి వచ్చిన చలాన్లు చూసి ట్రాఫిక్ పోలీసులు సైతం షాక్ అయ్యారు. 79 చలాన్లు పెండింగ్‌లో ఉన్న బైక్‌ను ట్రాఫిక్ పోలీసులు సీజ్ చేశారు. బుధవారం నేరేడ్‌మెట్ చౌరస్తాలో ట్రాఫిక్ పోలీసులు వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా సందీప్‌కుమార్‌కు చెందిన (ఏపీ 10 ఏడబ్లూ 2064) బైక్‌పై 79 చలాన్‌లు ఉన్నట్లు గుర్తించారు. దీంతో బైక్‌ను సీజ్ చేసినట్లు మల్కాజిగిరి ట్రాఫీక్ సీఐ సుదీర్ కృష్ణ తెలిపారు.
చదవండి: ఇతగాడి పెండింగ్ చలానాలను చూస్తే అవాక్కవ్వాల్సిందే..
Comments
Please login to add a commentAdd a comment