
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, హైదరాబాద్: నగరంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఫొటో కోసం వెళ్లిన ఓ మైనర్ బాలికపై ఫొటోగ్రాఫర్ లైంగికదాడికి యత్నించాడు. ఈ ఘటన మంగళవారం ఉదయం నేరేడ్‌మెట్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాలు.. సైనిక్‌పురిలోని ఆర్.ఎస్. స్టూడియోలో ఫొటో దిగాడానికి వెళ్లిన మైనర్ బాలికపై ఫొటోగ్రాఫర్ సలీం అసభ్యంగా ప్రవర్తించాడు. ఫొటో తీస్తానంటూ బాలికను అసభ్యంగా తాకుతూ.. లైంగిక దాడికి యత్నించాడు. దీంతో బాలిక.. సలీం వికృత చేష్టలకు బయపడి అరుచుకుంటూ బయటకు పరుగులు తీసింది. అది గమనించిన స్థానికులు అతగాడికి దేహశుద్ధి చేశారు. ఇక ఈ ఘటనపై బాలిక తల్లి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా గాయాలపాలైన సలీం ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.