హైదరాబాద్ : జీహెచ్ఎంసీ ఎన్నికల సిబ్బంది సోమవారం మధ్యాహ్నం ఆందోళనకు దిగారు. నేరేడ్‌మెట్ భవన్స్ కాలేజీ పోలింగ్ సెంటర్‌లో పోలింగ్ సిబ్బందికి సరైన వసతులు కల్పించలేదని సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
జీహెచ్‌ఎంసీ ఎన్నికల నిర్వహణ భాగంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఎన్నికల సిబ్బంది ఆకలితో అలమటిస్తున్నామన్నారు. వెంటనే భోజన వసతితో పాటు కనీస వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. తమకు కేటాయించిన బూత్‌లలో కనీస వసతులు కల్పించకపోవడంతో ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని ఎన్నికల సిబ్బంది ఆందోళన చేపట్టారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికలు మంగళవారం జరుగనున్న విషయం తెలిసిందే.