
ఒక అభ్యర్థి..ఒకే డివిజన్ నుంచి పోటీ
సాక్షి, సిటీబ్యూరో: భవిష్యత్తులో జరుగబోయే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఒక అభ్యర్థి ఒక డివిజన్ నుంచి మాత్రమే పోటీ చేయాల్సి ఉంటుంది. ఒకే అభ్యర్థి ఒకటికన్నా ఎక్కువ డివిజన్లనుంచి కార్పొరేటర్‌గా పోటీ చేసేందుకు వీల్లేదు.
ఈ మేరకు జీహెచ్‌ఎంసీ చట్టానికి సవరణ చేశారు. అది ఈనెల 9వ తేదీ నుంచి అమల్లోకి రానుంది. దీన్ని గెజిట్‌లో ప్రచురించనున్నారు. ఈమేరకు మునిసిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధిశాఖ శనివారం జీవో జారీ చేసింది.